సునీల్ రెమ్యునేషన్ అంతా?

By Srikanya

కమిడెయిన్ నుంచి హీరోగా మారిన సునీల్ రెమ్యునేషన్ విషయంలో మాత్రం చాలా గట్టివాడని చెప్తున్నారు.అతను ఇప్పుడు రెండు కోట్లు వరకూ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటి వరకూ విడుదలైన అందాల రాముడు,మర్యాద రామన్న,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు చిత్రాల్లో రెండు మంచి హిట్ లు అవటం అతనికి ప్లస్ గా మారింది.అతని రెమ్యునేషన్ చూసే చాలా నిర్మాణ సంస్ధలు సైతం అతన్ని దూరంగా పెడుతున్నట్లు చెప్తున్నారు.అయితే సునీల్ కూడా ఆచితూచి అడుగులు వేయాలని ఏ కథ పడితే ఆ కథని,ఏ దర్శకుడుతో పడితే వాళ్లతో చేయకూడదనే వచ్చిన ప్రతీ ఆఫరూ ఒప్పుకోవటం లేదని చెప్తున్నారు.

అప్పలరాజు డిజాస్టర్ అయ్యాక అతని సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు.దొంగలముఠా లో చేసిన చిన్న పాత్ర అతనికి గుర్తింపు తేలేదు.ఇక ఇప్పుడు అహనాపెళ్లంట చిత్రంలో హిట్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న వీరభద్రంతో కలిసి పూల రంగడు చిత్రం చేస్తున్నాడు.ఆ చిత్రం హిట్ అయితే అతని కెరీర్ మళ్లీ గాడిలో పడినట్లుగా చెప్తున్నారు.నిజానికి ఈ చిత్రానికి ముందే తనూ వెడ్స్ మనూ చిత్రం రీమేక్ ప్రారంభం కావాల్సింది.అయితే స్క్రిప్టు సునీల్ కి పూర్తి సాటిస్ ఫై కాకపోవటంతో అతను ఈ పూలరంగడు చిత్రాన్ని కమిటయ్యాడని చెప్తున్నారు.అలాగే ఈ చిత్రం తర్వాత సునీల్ నిజానకి వీడు తేడా దర్శకుడు చిన్ని కృష్ణ చిత్రం చేస్తానని మాట ఇచ్చాడు.అయితే వీడు తేడా చిత్రం చాలా తేడాగా ఉండటంతో ఈ సినిమా చేసే అవకాసం లేదని చెప్తున్నారు.మరో ప్రక్క రాజమౌళి అశోసియేట్ కోటి దర్శకత్వంలో నెపోలియన్ అనే యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం కూడా సునీల్ ఓకే చేసి ఉన్నాడు.పూల రంగడు చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X