For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హిట్ కొడతాడా?: సునీల్ 'కృష్ణాష్టమి' ఇన్ సైడ్ టాక్

  By Srikanya
  |

  హైదరాబాద్: సునీల్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘కృష్ణాష్టమి'. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని చాలా రోజుల క్రితమే పూర్తీ చేసారు. అంతేకాదు, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా ఫినిష్ చేసి, పర్ఫెక్ట్ టైంకి రిలీజ్ చేయాలని ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు రిలీజ్ కు పెట్టారు.

  ఫిభ్రవరి 19న విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి ఇన్ సైడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఏం వినపడుతోంది అనేది మీకు ఇక్కడ ఇవ్వబోతున్నాం. అయితే మరో విషయం ఇదే కరెక్ట్ అని చెప్పలేం. ఎందుకంటే కేవలం ఇది టాక్ మాత్రమే. సినిమా రిలీజ్ అయ్యి ..ప్రేక్షకుల వద్దకు వెళ్లినప్పుడు మాత్రమే అసలైన టాక్ బయిటకు వస్తుంది. కాబట్టి ఈ టాక్ తో సరిపెట్టుకోకండి.

  Photos: కృష్ణాష్టమి ప్లాటినం డిస్క్ ఫంక్షన్

  ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాన్ని బట్టి ఈ చిత్రం కథ కొత్తదేం కాదు. అయితే ట్రీట్ మెంట్ మాత్రం కొత్తగా చేసేందుకు ప్రయత్నించారు. అందులో చాలా వరకూ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. చెప్పుకోదగ్గ ట్విస్ట్ లు టర్న్ లు లేని ఈ చిత్రం లో కామెడీ మాత్రం బాగా పండిందని తెలుస్తోంది. అలాగే ఎమోషన్ సీన్స్ కూడా సునీల్ బాగా చేసాడు.అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ అందించారు.

  About Sunil's Krishnashtami talk

  ఇక హైలెట్ బ్రహ్మానందం చేసిన సెల్ఫీ..బల్ఫీ క్యారక్టర్. ఈ క్యారక్టర్ తెరపైకి వచ్చినప్పుడల్లా నవ్వులు ఖాయం అంటున్నారు. సునీల్ ఈ చిత్రంలో యాక్షన్ హీరోలా ఉంటాడంటున్నారు. డాన్స్ లు కూడా బాగా కష్టపడి చేసాడని చెప్తున్నారు. అయితే కథ కొత్తగ లేకపోవటమే కొంత మైనస్ అని, అది ప్రేక్షకుడు పట్టింకుకోకపోతే మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు. సునీల్ కు రీ బ్యాక్ చిత్రం అవుతుందని అంటున్నారు.

  దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫామిలీ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి అన్నారు.

  ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ కూడా పూర్తయింది. U/A సర్టిఫికెట్ లభించింది. సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటీనటులు. దర్శకత్వం - స్క్రీన్‌ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - కోనా వెంకట్. ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

  English summary
  Sunil upcoming much expected film “Krishnashtami” directed by Vasu Varma of “Josh” fame is all set to hit the big screens on Feb. 19th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X