వెంకటేష్ 'రాధ' కథ వివాదం ఏమైంది?
హైదరాబాద్ : సినీ పరిశ్రమలో కాపీ వివాదలు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కథల విషయంలో పెద్ద దర్శకులు, సంస్ధల విషయంలోనూ పెద్ద పెద్ద వివాదాలే చెలరేగాయి. అయితే అవి బయిటకు పెద్దగా వచ్చేవి కాదు. గతంలోలా పరిస్ధితులు ఇప్పుడు ఉండటం లేదు. మీడియా పెరిగిపోవటంతో ప్రతీ విషయం నలుగురులో చర్చగా మారి మీడియాలోకి వచ్చేస్తోంది. తాజాగా వెంకటేష్ చేద్దామనుకుంటున్న 'రాధ' చిత్రం కథ విషయమై కాపీ వివాదం చెలరేగి,అది మీడియాకు ఎక్కింది. మారుతి దీనిపై సుదీర్ఘమైన వివరణ సైతం ఇచ్చారు. అయితే చివరకు ఈ వివాదం ముగిసిందా అంటే లేదనే తెలుస్తోంది.

సురేష్ బాబు ఈ విషయమై తెలివిగా నిర్ణయం తీసుకుని ముందు రాధ ప్రాజెక్టుని ప్రక్కన పెట్టి,వివాదాన్ని వాయిదా వేసాడంటున్నారు. వెంకటేష్ మొదట దృశ్యం రీమేక్, ఆ తర్వాత ఓ మైగాడ్ చిత్రాలు రీమేక్ లు చేసేలా ప్లాన్ చేసారు. దాంతో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది. అవి పూర్తయ్యాక అప్పటికీ వేరే ప్రాజెక్టు అనుకోకుండా ఇదే 'రాధ' ని కంటిన్యూ చేయాలనుకుంటే అప్పుడు ఆలోచించుకోవచ్చనే ఆలోచనతో ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందులోనూ దాసరి వంటి పెద్ద స్ధాయి వ్యక్తి సైతం ఈ ఇష్యూ పై కమిటీ వేయటానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది.
ఇక వివాదం వివరాల్లోకి వెళితే...ఓ పెద్ద దర్శకుడు వద్ద పనిచేసిన అశోశియేట్ డైరక్టర్ తాను దర్శకుడుగా మారటం కోసం... ఆ మధ్యన వెంకటేష్ కు కథ చెప్పటం జరిగింది. అయితే కొద్ది రోజులు స్టోరీ డిస్కషన్స్ జరిగాక, ఆ కథ వెంకటేష్ రిజెక్ట్ చెయ్యటం జరిగింది. అయితే అదే స్టోరీ లైన్ తో 'రాధ' చిత్రం తెరకెక్కుతోందని వారికి సందేహం వచ్చి రైటర్స్ అశోశియేషన్ ని సంప్రదించారు. అంతకుముందు ఈ విషయమై ఆ కథ రచయిత,ఆ దర్శకుడు వెంకటేష్ ని అడిగారని, సరైన స్పందన కొరవడటంతో సిని ఇండస్ట్రీ గురువుగారు గా భావించే దాసరి వద్దకు వెళ్లారని సమాచారం. ఆయన ఈ విషయం సెటిల్ చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు.
మారుతి దీనిపై స్పందిస్తూ... 'తాను ఎవరి కథను కాపీ కొట్టలేదని, ఒకే ఆలోచన ఇద్దరికీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక వేళ తన కథ..వేరొకరి కథను పోలి ఉన్నట్లు ఉంటే మార్పులు చేస్తాను. తుది నిర్ణయం రైటర్స్ అసోసియేషన్ తీసుకుంటుంది. ఈ వివాదం క్లియర్ అయ్యే వరకు సినిమా షూటింగ్ మొదలు పెట్టను' అని మారుతి స్పష్టం చేసారు.


Click it and Unblock the Notifications











