For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒప్పుకుంటాడా ?: రామ్ చరణ్ కు డిస్ట్రిబ్యూటర్స్ విజ్ఞప్తి

  By Srikanya
  |

  హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ, ది ఫైటర్ చిత్రం ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ బాగా లాస్ అవుతన్నట్లు ట్రేడ్ లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు డబ్బై శాతం వరకూ పోతుందని చెప్పుకుంటుున్న నేపధ్యంలోడిస్ట్రిబ్యూటర్స్ రామ్ చరణ్ రికవరీ విషయమై విజ్ఞప్తి చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ విషయమై రామ్ చరణ్ తదుపరి చిత్రం తని ఒరువన్ చిత్రం రీమేక్ డిస్ట్రిబ్యూషన్ అడుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. దాంతో తమ నష్టం కొంతలో కొంత రికవరీ అవుతుందని వారు కోరుతున్నట్లు సమచారం. అయితే ఈ విషయమై నిర్మాత దానయ్య, హీరో రామ్ చరణ్ ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ రైట్స్ కోసం ఆరు కోట్ల రూపాయలు వరకూ వెచ్చించినట్లు సమాచారం.

  సినిమాకు ప్లాఫ్ టాక్ వచ్చి పెట్టిన పెట్టుబడి వెనక్కి తిరిగిరాకపోతే తమిళనాట...హీరోలు, నిర్మాతలు రికవరీ చేస్తూండటం మామూలే. అలాంటిదే ఇప్పుడూ జరుగుతోందని,కొత్తే కాదని కొందరంటున్నారు. అయితే ఈ విషమయై అఫీషియల్ సమాచారం ఏదీ లేదు.

  Accept ?: Distributors Plea to Ram Charan

  శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం 'బ్రూస్‌లీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్‌ సంగీతం అందించారు. దసరా సందర్భంగా ఈ నెల 16న 'బ్రూస్‌లీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఓవర్ సీస్ లో ఫ్లాఫ్ అని తేలినట్లే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రామ్ చరణ్ కు తొలి నుంచి ఓవర్ సీస్ లో మార్కెట్ లేదు అనే వాదన ఒకటి ఉంది...

  ముఖ్యంగా యుఎస్ భాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షో తర్వాత కలెక్షన్స్ ఆటోమేటిక్ గా డ్రాప్ అయ్యాయని తెలుస్తోంది. రివ్యూల కన్నా స్ట్రాంగ్ గా ఉన్న మౌత్ టాక్ సినిమాని ముంచేసింది అని చెప్తున్నారు. మొదట యుఎస్ లో 50% పోతుందని అంచనా వేసారు. అయితే తర్వాత ఇప్పుడు కలెక్షన్స్ పరిస్ధితి చూసాక... అరవై నుంచి డబ్బై శాతం వరకూ పోతుందని భావిస్తున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత ఓవర్ సీస్ మార్కెట్ బాగా పెరిగిందని అనుకున్నవాళ్లకు ఇదే సమధానం అంటున్నారు. సినిమాలో కంటెంట్ లేకపోతే ఎంత మార్కెట్ పెరిగినా ఉపయోగం లేదని చెప్తున్నారు. అంతేకాదు చిరంజీవి ఫాక్టర్ సైతం సినిమాని నిలబెట్టలేకపోవటం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నారు.

  ఇక్కడ ఇండియాలో నూ మార్నింగ్ షోకే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్ లు రెండోరోజుకే డ్రాప్ అయ్యాయి. మెదటి రోజు ఆంధ్రా మరియు తెలంగాణ లో 12.66 కోట్లమేర షేర్ రాగా, రెండో రోజు మౌత్ టాక్ స్ర్పెడ్ అవడంతో 4 కోట్ల షేర్ కి పడిపోయింది. చాలా ధియోటర్స్ రుద్రమదేవితో రెండో వారం వేసే అవకాసం ఉంది.

  చిత్రం కథేమిటంటే.....

  అందరూ లక్ష్యం వైపే పరుగెడతారు...కొందరు మాత్రమే తన వాళ్ల కోసం నిలబడతారు..అటువంటి వారిలో ఒకడు బ్రూస్ లీ (రామ్ చరణ్). అక్క (కీర్తి కర్బంద) అంటే ప్రాణంగా పెరిగిన బ్రూస్ లీ... చిన్నప్పటి నుంచీ ఆమె కోసం తన చదువును,కెరీర్ ని సైతం త్యాగం చేస్తాడు. ఆమె కలెక్టర్ కావాలని తన తండ్రికి ఇష్టం లేకపోయినా చదువుకు ఫుల్ స్టాఫ్ పెట్టి స్టంట్ మ్యాన్ గా లైఫ్ ప్రారంభిస్తాడు. అంతేకాకుండా తప్పుడు కేసు పెట్టి తన అక్క కలెక్టర్ అవ్వాలనే లక్ష్యంకు అడ్డుపడబోయిన దీపక్ రాజ్ (అరుణ్ విజయ్)కు బుద్ది చెప్తాడు.

  ఇలా అక్క...తను అన్నట్లు నడుస్తూండగా.. ఓ ట్విస్ట్. తన తండ్రి (రావు రమేష్) పని చేసే సంస్ధ యజమాని జయరాజ్(సంపత్ రాజ్), నదియాల కుమారుడుతో వివాహం నిశ్చియం అవుతుంది. అయితే జయరాజ్ పైకి కనిపించినంత మంచి వాడు కాదు. అతనికో దుర్మార్గమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది దాచి పెద్దమనిషిలా చెలామణి అవుతూంటాడు. అది తెలిసిన హీరో...ఆ విషయాన్ని ఎలా బయిటపెట్టి, విలన్ కు ఎలా బుద్ది చెప్పాడు. కథలో రియా (రకుల్) పాత్ర ఏమిటి... చిరు ఎంట్రీ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  English summary
  Now Overseas distributors requesting hero Ram Charan and producer Danayya to help them recovering the losses by giving their next film rights.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X