'రుద్రమదేవి' సెట్లో ప్రమాదం

By Srikanya

హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రుద్రమదేవి' సినిమాని సమస్యలు వెంబడిస్తున్నాయి. నిన్నటి రోజు ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుని షెడ్యూల్ కాన్సిల్ అయినట్లు మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం...స్టంట్ మెన్ ఒకరు ఈ ప్రమాదంలో బాగా గాయపడ్డారని, అతని బ్యాక్ బోన్ కి బాగా దెబ్బలు తగిలాయని చెప్తున్నారు. వెంటనే అతన్ని అపోలో హాస్పటిల్ కి షిప్ట్ చేసి ట్రీట్ మెంట్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు గుణశేఖర్...నానక్ రామ్ గూడాలో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో పైన ఉన్న సంట్ మేన్..రోప్ లూజ్ కావటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని చెప్తున్నారు. అయితే అఫీషియల్ గా ఈ విషయమై చిత్రం యూనిట్ గానీ, దర్శక,నిర్మాతలు నుంచి కానీ ప్రకటన రాలేదు. వారి నుంచి వస్తే గానీ అసలేం జరిగింది...నిజా నిజాలు ఏమిటి అనేది తెలియదు.

 Accident occurred at Rudramadevi sets

అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్రధారి. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు. ఈ మేరకు ఖర్చు కూడా భారీగా పెడుతున్నారు.

దర్శుడు మాట్లాడుతూ... ''కాకతీయుల కాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా ఈ సెట్‌లు ఉండబోతున్నాయి. వీటి కోసం తోట తరణి 400 స్కెచ్‌లు వేశారు. నాటి సంప్రదాయలు, జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చిత్రబృందం ఎంతో శ్రమించి వీటికి రూపు తీసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని సెట్‌లలో షూటింగ్‌ చేశాం. మిగిలిన వాటిలో త్వరలోనే చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X