NTR 31 : ఎన్టీఆర్ 31లో సూపర్‌స్టార్ ... తారక్‌తో తలపడేందుకేనా?
యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. చివరిగా దేవరతో వచ్చి మంచి రిజల్ట్ ను సొంతం చేసుకున్నారు. సినిమా ఆశించిన మేర లేకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు వసూళ్ల లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ నెక్ట్స్ చేస్తున్న.. చేయబోతున్న ప్రాజెక్ట్స్ పైనా అభిమానుల ఫోకస్ ఉంది. ఈమేరకు తారక్ కూడా చకచకా షూటింగ్ లు పూర్తి చేసుకుంటున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న సక్సెస్ ఫుల్ సిరీస్ 'వార్' రెండో భాగం 'వార్ 2'లో నటిస్తున్నారు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రుతిక్ రోషన్ కు ప్రత్యర్థి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని ప్రచారం. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని ఇప్పటికే యూనిట్ హైప్ పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకోసం ఎన్టీఆర్ ఇంకొక ఫారేన్ షెడ్యూల్ ను పూర్తి చేయాల్సి ఉందట.

ఆ తర్వాత తారక్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 31వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే నీల్ ఈ పీరియాడికల్ ఫిల్మ్ కు సంబంధించిన స్క్రిప్ట్, కాస్ట్ అండ్ క్రూను ఫైనల్ చేసి ఉన్నారని ఈ నెలలోనే చిత్ర షూటింగ్ ను ప్రారంభించబోతున్నారని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని టాక్. అయితే వార్ షెడ్యూల్ ముగియగానే ఎన్టీఆర్31 మొదలవుతుందంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ 31లో నటించే ఇతర తారాగణంపై మరింత ఆసక్తి నెలకొంది. ఎస్ఎస్ రాజమౌళి మాదిరిగానే.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం తన చిత్రాల్లో హీరోలకు ధీటుగా విలన్స్ ను చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఎన్టీఆర్31లో గట్టి కాస్ట్ ను సెట్ చేశారని తెలుస్తోంది. ఇందులో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, బిజూ మీనన్ పేర్లు వినిపిస్తున్నాయి.

వీరిద్దరికి మలయాళంలో చాలా గుర్తింపు ఉంది. సీనియర్ నటుడుగా బిజూ మీనన్ నటిస్తుండటం, అలాగే ప్రముఖ హీరో టోవినో థామస్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే టోవినో థామస్ మారి2, 2018 వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ తో బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని అంటున్నారు. ఫ్యాన్స్ కు మాత్రం ఇది కిక్కిచ్చే న్యూస్ చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ స్కేల్లో నిర్మించబోతున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications