RRRకు సవాల్.. తెరపైకి మరో భారీ మల్టీస్టారర్.. రాజమౌళికి గట్టిపోటి!
బాహుబలి తర్వాత దక్షిణాదిలో సినీ నిర్మాణం, బడ్జెట్ విషయంలో పోటీ భారీగా పెరిగింది. రాజమౌళి భారీ బడ్జెట్‌తో బాహుబలి1, 2 తీస్తే.. అంతే స్థాయిలో రూ.600 కోట్ల బడ్జెట్‌తో తమిళం నుంచి రోబో 2.O లాంటి భారీ గ్రాఫిక్స్ మూవీ వచ్చింది. బాహుబలి తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్‌తో మూవీ రాజమౌళి ప్లాన్ చేశాడు. అదేరకంగా తమిళంలో మణిరత్నం మరో భారీ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..

రాజమౌళిపై భారీ అంచనాలతో
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా తర్వాత రాజమౌళి ఏం చేస్తాడు అనే ప్లాన్‌తో ఎదురు చూస్తే భారీగా షాకిచ్చాడు. ఎన్టీఆర్, రాంచరణ్‌తో మల్టీస్టారర్ ప్లాన్ చేసి అభిమానులకు కిక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది.

విక్రమ్, విజయ్‌తో మణిరత్నం మల్టీస్టారర్
ఇక నవాబు సక్సెస్‌తో జోష్ పెంచిన మణిరత్నం తమిళంలో విక్రమ్, విజయ్, శింబుతో ఓ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని భారీ తారాగణం, బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది.

ప్రముఖ నవల ఆధారంగా
ప్రస్తుతం మణిరత్నం మల్టీస్టారర్ స్క్రిప్టు దశలో ఉన్నట్టు సమాచారం. తమిళంలో ప్రజాదరణ పొందిన నవల ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలిసింది. ఈ చిత్రం మరో దళపతి లాంటి చిత్రం కావొచ్చనే మాట తమిళ వర్గాల్లో వినిపిస్తున్నది.

హీరో విక్రమ్, విజయ్ క్రేజ్‌తో
విక్రమ్, విజయ్‌లకు తమిళంలోనే కాదు దక్షిణాదిలో ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. అలాంటి వారితో సినిమా అంటే దక్షిణాదిలో మంచి మార్కెట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే ఇది RRR, రాజమౌళి చిత్రానికి పోటీ అవుతుందా అనే కచ్చితంగా చెప్పలేం. కొద్దిరోజులు ఆగితే అసలు విషయం బోధపడుతుంది.


Click it and Unblock the Notifications











