Don't Miss!
- News
నేటినుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం: రేపే బడ్జెట్ .. షెడ్యూల్ ఇలా!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
ఆచార్య ఎఫ్టెక్ట్.. మొదటికొచ్చిన పుష్ప, RRR రిలీజ్ డేట్స్ గొడవ.. మళ్ళీ వాయిదా?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినిమాల విడుదల తేదీల విషయంపై గత కొన్ని నెలలుగా బడా నిర్మాతలు సుదీర్ఘంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే కొందరు ముందు జాగ్రత్తగా ఆలోచించి ఏడాది ముందే కొన్ని విడుదల తేదీల పై క్లారిటీ అయితే ఇచ్చేశారు. అయితే ఎవరు ఎంత ముందుగా ప్రకటించినా కూడా ఆ తర్వాత ఏదో ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధం కావాల్సి వస్తోంది. ఇప్పటికే పుష్ప సినిమా డిసెంబర్ 17న రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇక రాజమౌళి RRR సినిమా సంక్రాంతికి రానున్నట్లు తెలియజేశారు. అయితే మాఫీకొన్ని కారణాల వలన మళ్ళీ ఈ రెండు సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ వైరల్ అవుతోంది.

సడన్ గా షాక్ ఇచ్చిన RRR
2022 సంక్రాంతి టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా ముఖ్యం కానుంది. ఈ సారి బాక్సాఫీస్ వద్ద గతంలో ఎప్పుడూ లేనివిధంగా అతి పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి కొందరు ఇటీవల సంక్రాంతికి రానున్నట్లు కొత్త డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. పవన్ మహేష్ లాంటి వారు వారి సినిమాల విడుదల తేదీల పై కూడా నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉన్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. RRR సినిమా జనవరి 7వ తేదీన రాబోతున్నట్లు సడన్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మొదట ఆ ముగ్గురు
అందరి కంటే ముందే సంక్రాంతికి రాబోతున్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా జనవరి 13న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ జనవరి 12 వ తేదీన రాబోతోంది. ఇక మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ అదే సమయంలోనే రాబోతున్నట్లు క్లారిటీ అయితే ఇచ్చేశారు.. ఈ ముగ్గురు నిర్మాతల మధ్య లో ఒక చర్చ అయితే కొనసాగింది దాదాపు అందరూ కూడా విడుదల తేది లపై కొంత సంతృప్తిగానే ఉన్నారు.

RRR మళ్ళీ వాయిదా
ఇక సడన్ గా RRR సంక్రాంతిని టార్గెట్ చేయడంతో ఇద్దరు నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాదారణంగా రాజమౌళి సినిమాకు సీజన్ తో అవసరం లేదు. ఆ మల్టీస్టారర్ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని అందుకే సినిమా విడుదలను ఇతర సినిమాల కలెక్షన్స్ పై ప్రభావం పడేలా విడుదల చేయవద్దని నిర్మాతల నుంచి అభ్యంతరాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కాని రాజమౌళి అయితే RRR సినిమా మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో కొత్త టాక్ ఒకటి వైరల్ అవుతోంది.
Recommended Video

పుష్పపై ఆచార్య ఎఫెక్ట్..
అంతేకాకుండా ఆచార్య సినిమా కారణంగా పుష్ప సినిమా కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాను డిసెంబర్ క్రిస్మస్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది అందుకే పుష్ప సినిమాను కాస్త ముందుకు లేదా వెనకాలకు లాగే అవకాశం ఉందట. వీలైనంతవరకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఉండకుండా చూసుకోవాలి అని అల్లు అర్జున్ కూడా ఆలోచించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాల విడుదల తేదీపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.