మెగాఫ్యాన్స్ కు ఊహించని షాక్.. ఆచార్య లైన్ లీక్.. సినిమా వాయిదా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చాలా కాలం క్రితమే పూర్తయింది. అయితే మెగా ఫాన్స్ కు మేకర్స్ ఈ సినిమా విషయంలో షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

ఫిబ్రవరిలో ఆచార్య
సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఆచార్య. భరత్ అనే నేను సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. చిరంజీవి పెద్ద వయస్సు రీత్యా ఈ సినిమా షూటింగ్ కూడా కరోనా పరిస్థితుల్లో చేయలేకపోయారు. అందుకే లెక్క ప్రకారం ఈ సినిమా 2021 మే నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా వాయిదా వేసి 2022 ఫిబ్రవరిలో చేయడానికి ప్లాన్ చేశారు.

ఒమిక్రాన్ కూడా తోడై
అయితే ఇప్పుడు మరోసారి కరోనా మరోసారి తన పంజాను విసరడం మొదలు పెట్టగా ఇప్పుడు దానికి ఒమిక్రాన్ కూడా తోడైంది. ఈ క్రమంలో మళ్ళీ ప్రభుత్వాలు చర్యలు తీసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమమంలోనే అన్ని బాషల భారీ బడ్జెట్ సినిమాలన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. టాలీవుడ్ విషయానికి వస్తే.. RRR, రాధే శ్యామ్ సహా చిన్న చిన్న సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. తమకు ఇబ్బంది లేదు అనుకున్న కొన్ని సినిమాలు రిలీజ్‌లకు రెడీగా ఉన్నాయి.

నైట్ కర్ఫ్యూ
అయితే ముందే మెగాస్టార్ చిరంజీవి, మెగా వపర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' సినిమాను ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మెగాస్టార్ ఆచార్య సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు థియేటర్స్ అన్నీ మూత పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పుడు ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా రన్ చేయడానికి సిద్ధం ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. అంటే ఒక ఆట తగ్గించాల్సి ఉంటుంది. మరో పక్క ఏపీలో టికెట్ రేట్స్ ఎలాగూ తక్కువగా ఉన్నాయి.

ఆచార్య కూడా వాయిదా
తెలంగాణలో ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నా ఎప్పుడు ఎలాంటి ఆంక్షలు విధిస్తారో చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్స్ పరిస్థితి చక్కబడే వరకు పెద్ద సినిమాల రిలీజ్‌లు వాయిదా పడతాయని అంటున్నారు. ఆ క్రమంలోనే ఆచార్య రిలీజ్ కూడా వాయిదా పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆ సంగతి త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు.

నక్సలైట్ పాత్రలో
ఇక సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తో కలిసి నిర్మిస్తోంది.. ఇక నిర్మాతగా రామ్ చరణ్ తేజ్ అలాగే నిరంజన్ రెడ్డి ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. మేకర్స్ ఆచార్య ప్లాట్‌ను బహిర్గతం చేయలేదు, కానీ ఈ సినిమా ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న ఆలయాల స్కామ్ ఆధారంగా తెరకెక్కిస్తున్నామని చెబుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా, సోషల్ మీడియా ఆచార్య ఒక పుస్తకం ఆధారంగా రూపొందించబడిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సుబ్బారావు పాణిగ్రహ పుస్తకం ఆధారంగా
ఆచార్య సినిమా సుబ్బారావు పాణిగ్రహ పుస్తకం ఆధారంగా రూపొందించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే, సుబ్బారావు ఒరిస్సాకు చెందినప్పటికీ శ్రీకాకుళంలో స్థిరపడి అక్కడ ఒక పూజారిగా పనిచేశాడు. జమీందార్లు నిర్వహిస్తున్న ఆలయ వ్యవస్థలో అక్రమాలను సంబంధిత పూజారి తీవ్రంగా వ్యతిరేకించారు. జమీందార్లకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇద్దరు నక్సలైట్లు సుబ్బారావుకు మద్దతుగా వచ్చారు. నక్సలైట్లు గ్రామంలో ఉపాధ్యాయులుగా పనిచేసి, ఆలయంలో జరుగుతున్న అకృత్యాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు ఒక సాధనంగా ఉపయోగించుకున్నారని చెబుతున్నారు. ఇక ఆచార్యలో చిరంజీవి మరియు రామ్ చరణ్‌లను నక్సలైట్లుగా మారిన సామాజిక సంస్కర్తలుగా చూపించనున్నారని అంటున్నారు. కొరటాల శివ ఈ పుస్తకం నుండి తన స్ఫూర్తిని తీసుకుని ఆచార్యకి తగిన మార్పులు చేశారని బలమైన టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











