. ఆచార్యలో చరణ్ రోల్.. అసలు సంగతి ఇదన్నమాట!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్స్ కు ఈ ఏడాది ఒక బిగ్ ఫెస్టివల్ అనే చెప్పాలి. ఉప్పెన సినిమాతో కొత్తగా వచ్చిన సరే మెగా స్టామినా ఏమిటో బాక్సాఫీస్ కు రుచి చూపించాడు. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అనంతరం అందరి ఫోకస్ ఆచార్య పైనే ఉంటుంది.
ఆ సినిమాపై అంచనాలు రోజురోజుకు తారా స్థాయికి చేరిపోతున్నాయి. ఇక సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మొదట ఏదో 30 నిమిషాల గెస్ట్ రోల్ అనుకున్నారు. కానీ మెగాస్టార్ సలహాలు మేరకు కొరటాల కథలో మార్పులు చేయలేక తప్పలేదట. రామ్ చరణ్ సిద్దా అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనిపించబోతున్నాడు.

దాదాపు సినిమాలో గంటకు పైగా ఉంటాడట. ఇక దీన్ని మల్టీస్టారర్ అనకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. దర్శకుడు కొరటాల చరణ్ కోసం ఇప్పటికే చాలా మార్పు చేశాడు. ఇక రామ్ చరణ్ మెగాస్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపించే సీన్స్ తో పాటు ఇద్దరి హీరోల నడుమ ఒక స్పెషల్ సాంగ్ ను కూడా యాడ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ సాంగ్ ఆడియెన్స్ కు గూస్ బంప్స్ రావడం ఖాయమని చెప్పవచ్చు. ఇక మే 14 ఆ ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











