Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. శివరాత్రి కానుకగా ఆచార్య స్పెషల్ సర్ ప్రైజ్
మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆచార్య ఒకటి. ఇప్పటికే ఆచార్య టీజర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మెగా స్టార్ ఎలాంటి సినిమా చేసినా కూడా రికార్డులు ఒక రేంజ్ లో బ్రేక్ అవ్వాల్సిందే. ఇక ఆచార్య సినిమా మొత్తానికి మే 13న రాబోతున్నట్లు టీజర్ తోనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు సంబంధించిన మరో స్పెషల్ సర్ ప్రైజ్ ను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
బిజినెస్ స్టార్ట్ అయ్యింది
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తొలిసారిగా వస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ సినిమాపై అంచనాలు అకాశాన్ని తాకుతున్నాయి. ఇక షూటింగ్ పూర్తి కాకముందే ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ పనులను మొదలు పెట్టారు నిర్మాతలు.
నెవర్ బిఫోర్ అనేలా రామ్ చరణ్
ఆచార్య సినిమాలో మెగా తనయుడు రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. టీజర్ లో కేవలం చరణ్ వాయిస్ మాత్రమే వచ్చింది. ఇక ఆ పాత్రకు . అందుకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ ను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రామ్ చరణ్ లుక్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన సిద్దా లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవర్ఫుల్ డీల్స్..
సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఆంద్రప్రదేశ్ మొత్తంగా 60కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు సమాచారం. ఇక నైజాంలో అత్యదిక మార్కెట్ ఉన్న హీరోల్లో మెగాస్టార్ ఒకరు. ఇక్కడ 35కోట్లకు పైగా బిజినెస్ చేయనున్నట్లు సమాచారం. సీడెడ్ లో కూడా మెగాస్టార్ మరోసారి తన సత్తా చాటేలా ఉన్నారు. ఈ ఏరియాలో సినిమా రైట్స్ 17కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం
మొదటి సాంగ్ ఎప్పుడంటే..
మొత్తంగా ఆచార్య సినిమా తెలుగు రాష్ట్రాల్లో 112కోట్ల నుంచి 115కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక శివరాత్రి కానుకగా మార్చ్ 11న సినిమాకు సంబంధించిన మొదటి డేవోషనల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా హిందు దేవాలయాలకు సంబంధించిన యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమా కాన్సెప్ట్ కు తగ్గట్లుగానే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.