twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన బయోపిక్‌గా ఆచార్య మూవీ: సినిమా కథ మొత్తం లీక్.. చిరు, చరణ్ తర్వాత హైలైట్ పాత్ర అదే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు భారీ స్థాయిలో వస్తున్న విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచితో మార్పులు రావడంతో పాటు హీరోలు కూడా అలాంటి సినిమాలు చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అందుకే ఆ తరహా సినిమాలు ఎక్కువయ్యాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఓ మల్టీస్టారర్ మూవీ రాబోతుంది.

    Recommended Video

    Acharya Movie Story Based On A Great Book, Here Is the Details | Filmibeat Telugu

    అదే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆచార్య'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కథ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

    మెగా మల్టీస్టారర్‌గా ‘ఆచార్య'

    మెగా మల్టీస్టారర్‌గా ‘ఆచార్య'

    మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమే ‘ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామటాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ

    అంచనాలకు తగ్గట్టే బిజినెస్

    అంచనాలకు తగ్గట్టే బిజినెస్

    మెగా హీరోల రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ‘ఆచార్య' మూవీని రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ డీల్స్ జరిగినట్లు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో రికార్డు బిజినెస్ జరిగిందట.

    రిలీజ్ ఆలస్యం అందుకేనట

    రిలీజ్ ఆలస్యం అందుకేనట

    క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఆచార్య' మూవీకి సంబంధించిన బ్యాలెన్స్ షూట్‌ను ఇటీవలే పూర్తి చేసుకున్నారు. దీంతో ఏ పండగకైనా దీన్ని విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ, దీన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హిందీలోనూ విడుదల చేస్తుండడం వల్లే లేట్ చేశారని టాక్. అప్పటికి RRR వచ్చి రామ్ చరణ్ క్రేజ్ పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిసింది.

    Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రేమజంటకు అదిరిపోయే ఆఫర్.. మరోసారి హౌస్‌లో రొమాన్స్ చేసేందుకు రెడీBigg Boss OTT: బిగ్ బాస్ ప్రేమజంటకు అదిరిపోయే ఆఫర్.. మరోసారి హౌస్‌లో రొమాన్స్ చేసేందుకు రెడీ

    ఆచార్య మూవీ నేపథ్యం ఇదే

    ఆచార్య మూవీ నేపథ్యం ఇదే

    కొరటాల శివ సినిమాలు అంటేనే సందేశాత్మకంగా ఉంటాయి. ఇప్పుడు ‘ఆచార్య' కూడా అదే పంథాలో సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ రూపొందించారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడనే టాక్ వినిపిస్తోంది.

    ఆయన బయోపిక్‌గా ఆచార్య

    ఆయన బయోపిక్‌గా ఆచార్య

    ‘ఆచార్య' మూవీకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాను ‘సుబ్బారావు పాణిగ్రాహి జీవితం' అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. సుబ్బారావు పాణిగ్రాహి అనే పూజారి శ్రీకాకుళం ప్రాంతంలో ఇద్దరు నక్సలైట్లతో కలిసి దేవాదాయ భూముల కోసం పోరాటం చేశాడట. ఇదే కథతో సినిమా రూపొందినట్లు టాక్.

    Disha Patani: లోదుస్తులతో పచ్చిగా హీరోయిన్ ఫోజు.. ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!Disha Patani: లోదుస్తులతో పచ్చిగా హీరోయిన్ ఫోజు.. ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!

    హీరోల తర్వాత ఆ రోల్ బాగా

    హీరోల తర్వాత ఆ రోల్ బాగా

    ‘సుబ్బారావు పాణిగ్రాహి జీవితం' పుస్తకంలో ఉన్న ఇద్దరు నక్సలైట్ల పాత్రలను చిరంజీవి, చరణ్ పోషిస్తున్నారట. వీళ్లిద్దరూ ఆ పూజారితో కలిసి దేవాదాయ భూముల రక్షణకు, అక్కడి ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా హీరోలిద్దరి తర్వాత పూజారి పాత్రే ఇందులో హైలైట్ అవబోతుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఆ పాత్రను ఎవరు చేశారో చూడాలి.

    ఆయన బయోపిక్కే కాకపోతే

    ఆయన బయోపిక్కే కాకపోతే

    ‘ఆచార్య' మూవీ సుబ్బారావు పాణిగ్రాహి జీవిత కథ ఆధారంగా తెరకెక్కే చిత్రమే అయినా.. ఇందులో చాలా మార్పులు చేశారని సమాచారం. మరీ ముఖ్యంగా పూజారికి సహాయం చేసిన ఇద్దరు నక్సలైట్ల పాత్రలను ఎక్కువగా ఎలివేట్ చేశారని తెలుస్తోంది. అంటే ఈ సినిమా సుబ్బారావు పాణిగ్రాహి బుక్‌లా కాకుండా వేరేలా ఉండబోతుందని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

    English summary
    Megastar Chiranjeevi - Ram Charan Upcoming Film is Acharya. This movie directed by Koratala Siva. Movie Story Based on Subbarao Panigrahi Book.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X