బ్రేకింగ్: మెగా ఫ్యాన్స్‌కు షాక్.. ఆచార్య రిలీజ్ వాయిదా.. కారణం ఏమిటంటే!

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నిరంజన్ రెడ్డి నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఆచార్య మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉండగా కరోనావైరస్ పరిస్థితులు, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే శరవేగంతో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం మరోసారి వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

ఆచార్యపై భారీ అంచనాలు

ఆచార్యపై భారీ అంచనాలు

లాక్‌డౌన్ తర్వాత ఆచార్య సినిమా రిలీజ్ అయితే ఎప్పుడెప్పుడూ చూడాలనే కుతుహలం ప్రేక్షకుల్లో, మెగా అభిమానుల్లో ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు విపరీమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు, పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

లాహే లాహే పాటకు రికార్డు వ్యూస్

లాహే లాహే పాటకు రికార్డు వ్యూస్

ఇక ఆచార్య సినిమాలోని ఇటీవల విడుదల చేసిన లాహే లాహే పాటకు నెటిజన్లు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. కొద్ది గంటల్లోనే రికార్డు వ్యూస్ సాధించింది. ఇప్పటికే 12 మిలియన్ల వ్యూస్ సాధించి ఈ సినిమాపై క్రేజ్‌ను మరోసారి చెప్పకనే చెప్పింది. దాంతో ఈ సినిమాను మే 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు.

 ఆచార్య మూవీ విడుదల వాయిదా?

ఆచార్య మూవీ విడుదల వాయిదా?

కానీ ప్రస్తుతం తెలుగు, విదేశాల్లో చోటు చేసుకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొన్న చిత్ర యూనిట్, నిర్మాతలు ఆచార్య సినిమాను కొద్ది నెలలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే అధికారికంగా మాత్రం ఈ వార్త యూనిట్ నుంచి బయటకు రాకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా పరిస్థితులు, స్టూడెంట్ పరీక్షల నేపథ్యంలో

కరోనా పరిస్థితులు, స్టూడెంట్ పరీక్షల నేపథ్యంలో

ఆచార్య రిలీజ్‌ వాయిదాకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు ఓ కారణం కాగా, విద్యార్థుల పరీక్షలు మరో కారణమైనట్టు తెలుస్తున్నది. తెలంగాణలో విద్యార్థులకు పరీక్షలు ఒకసారి, ఆంధ్రాలో మరోసారి ఉండటంతో ఆచార్యను థియేటర్లకు తీసుకురావడం సరికాదనే భావనలో యూనిట్ ఉన్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఏపీ, తెలంగాణలో కరోనా పరిస్థితులు విజృంభిస్తున్న సమయంలో 50 శాతం సీటింగ్ కెపాసిటీని ప్రభుత్వాలు ఆలోచిస్తున్న విషయం కూడా సినిమా వాయిదాకు కారణమైందనే విషయం వెలుగులోకి వచ్చింది.

దసరా బరిలో ఆచార్య

దసరా బరిలో ఆచార్య

ఇదిలా ఉండగా, ఆచార్య సినిమాను జూన్, జూలై నెలల్లో కూడా రిలీజ్ చేసేందుకు సిద్దంగా లేనట్టు సమాచారం. కరోనావైరస్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొన్న తర్వాత ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X