ఆచార్య టీం కీలక నిర్ణయం.. నష్టాల నేపథ్యంలో అనూహ్యంగా కాజల్ అగర్వాల్ రంగంలోకి?

గత కొద్దిరోజులుగా ఆచార్య టీం వార్తల్లో నిలుస్తోంది. కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్స్ సెటిల్మెంట్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన సంపాదించుకున్న ఒక ప్లాట్ కూడా అమ్మకానికి పెట్టారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలలోకి వెళ్తే

 సీన్లు కట్ చేసి

సీన్లు కట్ చేసి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో రూపొందిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన పూజా హెగ్డే నటించగా ఇతర కీలక పాత్రలలో తనికెళ్ల భరణి, సోనూ సూద్ వంటి వారు నటించారు. అయితే ఈ సినిమాలో ముందు కాజల అగర్వాల్ చిరంజీవి సరసన నటించింది. కానీ ఏమనుకున్నారో ఏమో కానీ ఆమెకు సంబంధించిన అన్ని సీన్లు కట్ చేసి సినిమా విడుదల చేశారు.

రేటు ఇవ్వలేమని

రేటు ఇవ్వలేమని

అయితే ఇప్పుడు అదే విషయం వారి కొంపముంచేలా మారిందని అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్మే సమయంలో కాజల్ అగర్వాల్ కూడా సినిమాలో భాగంగా ఉంటుందని వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ సినిమా విడుదల సమయానికి కాజల్ అగర్వాల్ పాత్రను పూర్తిగా తప్పించడంతో ఇప్పుడు సాటిలైట్ హక్కులు కొనుక్కున్న ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాజల్ అగర్వాల్ పాత్ర లేకపోతే తాము అనుకున్న రేటు ఇవ్వలేమని తేల్చింది.

రంగం సిద్ధం

రంగం సిద్ధం


అంతేకాదు దానికి సుమారు రెండున్నర కోట్ల రూపాయల వరకు కోత పెడతామని చెప్పినట్లు టాక్. దీంతో ఇప్పటికే నష్టాలతో ఇబ్బందులు పడుతున్న ఆచార్య టీం ఆ రెండున్నర కోట్ల రూపాయలు కూడా నష్టపోవడం ఇష్టం లేక కాజల్ అగర్వాల్ నటించిన పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు అదనంగా జోడించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. అంటే థియేటర్లలో అలాగే ఓటీటీలో కూడా కనిపించని కాజల్ అగర్వాల్ కేవలం తెలుగు బుల్లితెర మీద మాత్రం కనిపించడానికి ఆచార్య టీం రంగం సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

నెత్తి మీద వేసుకున్నారని

నెత్తి మీద వేసుకున్నారని

నిజానికి ఆచార్య సినిమా విడుదలకు ముందే కొరటాల శివ ఈ సినిమా హక్కులన్నీ కొనుక్కుని తాను స్వయంగా డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముకున్నారని ప్రచారం జరుగుతోంది. మరోపక్క అదేమీ లేదని అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి అలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు బిజీగా ఉండడంతోనే దర్శకుడుగా ఉన్న కొరటాల శివ ఆ బాధ్యతలు నెత్తి మీద వేసుకున్నారని మరో టాక్ వినిపిస్తోంది.

చూడాలి మరి

చూడాలి మరి

అయితే ఈ విషయం మీద అసలు ఏం జరిగింది అనే విషయం కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి నలుగురికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. వారు ఖచ్చితంగా ఈ విషయం మీద క్లారిటీ ఇస్తే తప్ప ఈ విషయంలో నిజా నిజాలు ఏమిటి అనే విషయం మీద ఒక అవగాహన రాదు. అది వచ్చేవరకు ఈ రక రకాల పుకార్లు మాత్రం సోషల్ మీడియాలో మీడియాలో జరుగుతూ ఉంటాయి అని మాత్రం చెప్పొచ్చు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X