మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన సీనియర్ హీరో.. తన కెరీర్‌లో రికార్డు

ఒకప్పుడు హీరోగా సత్తా చాటిన యాక్షన్ కింగ్ అర్జున్ ఉన్నట్లుండి విలన్ అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఎన్నో సినిమాల్లో తన నటన, యాక్షన్ సీక్వెన్స్‌తో మెప్పించిన ఈయన.. రెండు సంవత్సరాల నుంచి స్టైలిష్ విలన్‌గా కనిపిస్తున్నారు. తమిళం, తెలుగు మరికొన్ని భాషల్లో నటిస్తూ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్న ఈ సీనియర్ యాక్టర్.. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టును పట్టేశారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకడైన దళపతి విజయ్ త్వరలో నటించబోయే చిత్రంలో అర్జున్ ప్రతినాయకుడి పాత్రను చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. విజయ్ 64వ సినిమా తెరకెక్కబోయే ఈ చిత్రంలో అర్జున్‌ ఓ డిఫరెంట్‌ విలనిజాన్ని చూపించనున్నారు. ఈ చిత్రానికి లోకేష్‌ కామరాజ్‌ దర్శకుడు. హీరోయిన్లుగా రాశీఖన్నా, రష్మిక ఎంపికయ్యారు. అనిరుధ్‌ సంగీతం సమకూర్చనుండగా, జేవియర్‌ బ్రెట్టో నిర్మించనున్నారు.

action king Arjun Took Another Big Project

ఈ సినిమా కోసం అర్జున్ భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు హీరోగా, విలన్‌గా ఏ సినిమాకు తీసుకోని మొత్తాన్ని విజయ్ సినిమా కోసం తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఆఫర్ తన కెరీర్‌లోనే భారీదని అర్జున్ తన సన్నిహితులతో కూడా చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. అర్జున్ ఏమీ డిమాండ్ చేయకపోయినా.. పాత్ర పరిధి మేరకు చిత్ర బృందమే ఆయనకు భారీ మొత్తం ఆఫర్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం విజయ్ అట్లీ దర్శకత్వంలో 'బిగిల్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తిచేసుకొని 64వ చిత్రంలో నటించనున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో హీరో, విలన్‌కు మధ్య మైండ్ గేమ్ నడుస్తుందని, విజయ్ పాత్రతో పోటీ పడే క్యారెక్టర్‌లో అర్జున్ నటిస్తున్నారని కోలీవుడ్ వర్గాల్లు చెప్పుకుంటున్నాయి. అందుకే ఈ స్టైలిష్ విలన్‌కు అవకాశం దక్కిందన్న టాక్ వినిపిస్తోంది.

మణిరత్నం దర్శకత్వం వహించిన 'కడల్‌' (తెలుగులో కడలి) చిత్రం ద్వారా అర్జున్‌ ప్రతినాయకుడిగా మారారు. విశాల్‌ నటించిన 'ఇరుంబు కుదిరై'లో స్టైలిష్‌ విలన్‌గా నటించి ఈ చిత్ర విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. అలాగే ఇటీవల విజయ్‌ ఆంటోని నటించిన 'కొలైకారన్‌' చిత్రంలో పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా కనిపించి మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. రీ ఎంట్రీలో తెలుగులోనూ 'లై', 'నా పేరు సూర్య' సహా పలు సినిమాల్లో నటించారాయన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X