Radhe Shyam Teaser: ఆ వీడియో స్పెషల్ సర్‌ప్రైజ్ అదే.. ప్రభాస్ నుంచి ఊహించని విధంగా!

సాదాసీదాగా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభం నుంచి ఓ మోస్తరు బడ్జెట్ సినిమాల్లోనే నటించిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో రేంజ్‌ను పెంచుకున్నాడు. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అవడంతో పాటు మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు.

ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ స్టార్ హీరో.. వరుసగా భారీ ప్రాజెక్టుల్లోనే నటిస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. ఈ మూవీ నుంచి అక్టోబర్ 23న టీజర్ రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దాని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

‘రాధే శ్యామ్' అంటోన్న ప్రభాస్

‘రాధే శ్యామ్' అంటోన్న ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పూర్తి స్థాయి రొమాంటిక్ పాత్రను చేస్తున్నాడు.

వరుస బ్రేకులు.. షూటింగ్ లేటుగా

వరుస బ్రేకులు.. షూటింగ్ లేటుగా

ప్రభాస్ 'బాహుబలి' నుంచి సినిమాల వేగాన్ని తగ్గించాడు. మంచి ఔట్‌పుట్ కోసం సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇదే 'రాధే శ్యామ్' విషయంలోనూ జరుగుతోంది. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అయినా.. పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల టాకీ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దీంతో చాలా ఆలస్యం అయిపోయింది.

అంచనాలకు తగ్గటుగానే బిజినెస్

అంచనాలకు తగ్గటుగానే బిజినెస్

'రాధే శ్యామ్' ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

 ‘రాధే శ్యామ్ టీజర్' రాబోతుంది

‘రాధే శ్యామ్ టీజర్' రాబోతుంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'రాధే శ్యామ్' మూవీ నుంచి టీజర్ రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఇటీవలే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను వదిలింది. ఇందులో 'రాధే శ్యామ్' టీజర్ అక్టోబర్ 23, ఉదయం 11:16 గంటలకు రాబోతుందని చెప్పారు.

వీడియో స్పెషల్ సర్‌ప్రైజ్ అదే

వీడియో స్పెషల్ సర్‌ప్రైజ్ అదే

'రాధే శ్యామ్' టీజర్ గురించి ప్రకటించగానే ప్రభాస్ అభిమానులే కాదు.. సామాన్య సినీ ప్రియులు సైతం దాని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఇలా ఉండబోతుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టీజర్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చూపించబోతున్నారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

Recommended Video

Madhura Wines Movie Team Chit Chat With Filmibeat Telugu | Part 4
ప్రభాస్ నుంచి ఊహించని విధంగా

ప్రభాస్ నుంచి ఊహించని విధంగా

'రాధే శ్యామ్' టీజర్ దాదాపు నిమిషానికి పైగానే ఉంటుందని అంటున్నారు. అన్ని భాషల్లోనూ ఒక దాన్నే (సబ్ టైటిల్స్‌తో) విడుదల చేస్తున్నారు. ఇక, ఇందులో ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా దర్శనమిస్తాడని తెలుస్తోంది. అలాగే, రొమాంటిక్ యాంగిల్‌ను కూడా హైలైట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. దీంతో దీనిపై అంచనాలు పెరిగాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X