రాజ్యసభ పదవి రేసులో ఆలీ, ప్రకాశ్ రాజ్.. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దల సభకు..!

తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దల సభ రాజ్యసభకు ఎంపిక జరిగే రేసులో సినీ నటులు ఆలీ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ పేర్లు మీడియాలో వినిపిస్తున్నాయి. కమెడియన్ ఆలీ, ప్రకాశ్ రాజ్ పేర్లు దాదాపు ఖరారైనట్టు వార్తలు రావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే వీరి ఎంపికపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 ఏపీ రాజకీయాల్లో అలీ

ఏపీ రాజకీయాల్లో అలీ


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా సినీ నటుడు అలీ రాజకీయాల్లో ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కీలక పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు మీడియాలో స్వైర విహారం చేశాయి.

 సినీ పెద్దలతో జరిపిన చర్చల్లో ఆలీ

సినీ పెద్దలతో జరిపిన చర్చల్లో ఆలీ


ఇక ఏపీ ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిపిన చర్చల్లో సినీ నటుడు ఆలీ కీలకంగా వ్యవహరించారు. ఎవరూ ఊహించని విధంగా ఆలీ చర్చల్లో పాల్గొనడంతో అధికార పార్టీ అండదండలు ఉన్నాయనే విషయం స్పష్టమైంది.

 కీలక పదవి అంటూ మీడియాలో

కీలక పదవి అంటూ మీడియాలో


ఇక ఇదిలా ఉంటే.. సినీ పరిశ్రమ పెద్దలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపిన కొద్ది రోజులకే సీఎం వైఎస్ జగన్‌ను తన భార్యతో కలిసి ఆలీ సమావేశమయ్యారు. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ తర్వాత ఆలీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుభవార్త అందుతుంది. వారి ఆదేశాల ప్రకారం మీరు నడుచుకొండి అంటూ పార్టీ పెద్దలు తెలిపిన విషయాలను ఆలీ వెల్లడించారు.

 మైనారిటీ కోటాలో ఆలీకి చోటు

మైనారిటీ కోటాలో ఆలీకి చోటు


అయితే ప్రస్తుతం ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆలీని పెద్దల సభకు పంపించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనే విషయంపై ఊహాగానాలు జోరందుకొన్నాయి. మైనారిటీ కోటాలో ఆలీకి రాజ్యసభ్య పదవి దక్కే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Recommended Video

CM KCR - Prakash Raj Surprise Move దక్షిణాది రాష్ట్రాల్లో కీలకం | Third Front | Oneindia Telugu
తెలంగాణ నుంచి ప్రకాశ్ రాజ్

తెలంగాణ నుంచి ప్రకాశ్ రాజ్


ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే వారిలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇటీవల జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సందర్శించినప్పుడు ఆయన వెంట ప్రకాశ్ రాజ్ ఉండటం అనేక ఊహాగానాలు లేచాయి. తాజాగా రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రకాశ్ రాజ్ పేరు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X