8 ఏళ్ల తర్వాత అర్జున్ సర్జా కీలక నిర్ణయం.. అసలైన గేమ్ షురూ
యాక్షన్ కింగ్, స్టార్ నటుడు అర్జున్ సర్జా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1981 నుంచి ఆయన తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి మెప్పించారు. 40 ఏళ్లుగా ఆయన చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక ప్రస్తుతం ఆయన కెరీయర్ లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు..
62 ఏళ్లలో సెన్సేషన్ గా..
అర్జున్ సర్జాకు దక్షిణాదిన సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. అయితే మొదటి నుంచి అర్జున్ సర్జా ప్రయోగాత్మక చిత్రాలు, సందేశాత్మక చిత్రాల్లో నటించారు. 20 ఏళ్లలోనే నట జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఇప్పటికీ అంటే 62 ఏళ్లకు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. అయితే ఆరు పదుల వయస్సులోనూ అర్జున్ సర్జా ఫిట్ నెస్ తో అందరినీ ఆకట్టుకుంటుండటం విశేషం.

40 ఏళ్లలో 160 చిత్రాలు..
మైసూర్ లో పుట్టి పెరిగిన అర్జున్ సర్జా తమిళ చిత్ర పరిశ్రమతో నటుడిగా పరిచయం అయ్యారు. హీరోగా ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించారు. అలాగే తెలుగు, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించారు. ఇప్పటి వరకు 160 చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇందులో 12 చిత్రాలను ఆయన డైరెక్ట్ చేయడం విశేషం. ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు.
8 ఏళ్ల తర్వాత హీరోగా..
అర్జున్ సర్జా చిత్రాలకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే 2017 వరకు అర్జున్ సర్జా హీరోగా సినిమాలు చేశారు. ఆ తర్వాత నుంచి సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ వెండితెరపై మెరుస్తున్నారు. ఇప్పటికీ చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే 8 ఏళ్ల తర్వాత అర్జున్ హీరోగా మళ్లీ సినిమా చేయబోతుండటం విశేషం.
లీడ్ రోల్ లో మళ్లీ అర్జున్ సర్జా నటించేందుకు సిద్ధమయ్యారు. కోలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో అర్జున్ సర్జా డైరెక్ట్ ఫిల్మ్ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ అసిస్టెంట్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతుండటం విశేషం. హీరోయిన్ గా అభిరామి, కూతురు పాత్రలో ప్రీతీ ముకుందన్ నటిస్తుండటం విశేషం. తండ్రి కూతురు చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని కోలీవుడ్ మీడియా వెల్లడించింది.


Click it and Unblock the Notifications











