56 ఏళ్లకు రెండో పెళ్లి.. ఏడాది కాకముందే విడాకులు.. ఈమాత్రం దానికి పెళ్లెందుకంటున్న నెటిజెన్లు!
పృథ్వీరాజ్.. బబ్లూ పృథ్వీరాజ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతశయోక్తి కాదు. మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోగా ఫుల్ క్రేజ్ సంపాధించుకున్న ఈయన పెల్లి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టారు. విలన్ గా కనిపించి తొలి తెలుగు చిత్రంతోనే ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత కూడా అధ్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా సమరసింహారెడడి, నువ్వు నాకు నచ్చావ్, దేవుళ్లు, ప్రేయసి రావే, దీర్ఘ ఆయుష్మాన్ భవ, ఊర్వశివో రాక్షసివో, జగమే మాయ, బలమెవ్వడు వంటి సినిమాలు చేశాడు.
ఇటీవల్ యంగ్ అండే డైనమిక్ హీరో రామ్ పోతినేని హీరోగా వచ్చిన స్కంద సినిమాలోనూ పృథ్వీరాజ్ నటించి మెప్పించాడు. అయితే ఆయన ఏడాది క్రితమే రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా ఆయన రెండో భార్యకు కూడా విడాకులు ఇవ్వబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1994లో తొలిసారి బీనాను వివాహం చేసుకున్నాడు బబ్లూ పృథ్వీరాజ్. అయితే వీరిద్దరికీ ఓ బాబు అహద్ మెహన్ జబ్బర్ అనే కొడుకు పుట్టాడు. అయితే ఆయన ఆటిజం సమస్యతో బాధ పడుతున్నాడు. అయితే చాలా కాలంపాటు అన్యోన్యంగా ఉన్న వీరి జంట మధ్య సమస్యలు రావడంతో దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే ఇద్దరూ కలిసి ఆరు సంవత్సరాల పాటు విడివిడిగా జీవించారు. పోయిన సంవత్సరమే చట్టబద్ధంగా విడాకులు తీసుకొని వేరయ్యారు. ఆ తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్న పృథ్వీరాజ్.. రుక్మిణి శీతల్ కు దగ్గరయ్యాడు.
తెలుగు అమ్మాయి అయిన రుక్మిణీ శీతల్.. పృథ్వీరాజ్ కంటే చాలా చిన్నది. దాదాపుగా వీరి మధ్య 30 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఆయనకు కూతురు వయసు ఉన్న శీతల్ ను పృథ్వీరాజ్ 56 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి వార్త బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కూతురు వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటంటూ చాలా మంది ప్రశ్నించారు. అయితే తామిద్దరం ప్రేమలో ఉన్నామని.. ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ ఇద్దరూ చెప్పారు.

ఆ తర్వాత అతి తక్కువ మంది సమక్షంలో గతేడాది నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లి జరిగి ఎనిమిది నెలలు మాత్రమే అవుతుండగా.. వీరిద్దరూ విడిపోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా విడాకులు కూడా తీసుకోబోతున్న్టలు ప్రచారం సాగుతోంది. ఈక్రమంలోనే బబ్లూ తనకు ప్రపోజ్ చేసిన వీడియోను డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











