ఆడవాళ్లు గెలవడానికి 34-26-34 ఉంటే చాలంటున్న బ్రహ్మాజీ...
కారెక్టర్ నటుడు బ్రహ్మాజీ ఇటీవల ట్విట్టర్ లో ఎకౌంట్ ఓపెన్ చేశాడు. ఏకధాటిగా ఇంట్రస్టింగ్ వార్తలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఆడ, మగల గురించి ఇటీవల ట్విట్టర్ లో ..'మగవాళ్లు గెలవాలంటే వాళ్లకి 100శాతం టాలెంట్ ఉండాలి. కానీ ఆడవాళ్లకి 6శాతం చాలు. మిగతాది 34-26-34తో నడిపించేస్తారు..వాళ్లు గెలవడానికి ఇవి మాత్రం చాలు అని పోస్ట్ చేశాడు..ఇలాంటివి తరచూ చాలానే పోస్ట్ చేస్తూ ఉంటుంటాడు..
దీన్ని బట్టి బ్రహ్మాజీ అతి పెద్ద భార్య భాధితుడనే అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. భార్య బాధితుల జోక్స్ విషయంలో అప్ టు డేటెడ్ గా ఉండే బ్రహ్మాజీ జోకులకి రాంగోపాల్ వర్మ లాంటి హేమాహేమీలు కూడా అభిమానులుగా మారిపోతున్నారు. అతని జోక్స్ అన్నీ ఆడవాళ్ల అధిక ప్రసంగం మీద, భర్తలని వేపుకు తినే ప్రవర్తన మీదే పడుతుంటాయి.
నిత్యం ఇవే జోకులతో కాలక్షేపం చేసే బ్రహ్మాజీ నిజానికి అలా తన భార్యపై కసి తీర్చుకుంటున్నాడని, భార్య బాధిత సంఘాన్ని అనఫిషియల్ గా నడుపుతున్నాడని జోకులు పడుతున్నాయి. ఇది చదివితే కనుక బ్రహ్మాజీ భార్య బాధిత జోకులకి ప్రత్యేక కారణమేంటో చెప్పాలి. ఒకవేళ తాను భార్య బాధితుడు కాని పక్షంలో అర్జంటుగా టాపిక్ మార్చేయాలి.


Click it and Unblock the Notifications











