Dhanush, Aishwarya R split: అర్ధరాత్రి విడాకుల ప్రకటన ముందు ఏం జరిగింది.. రజనీకాంత్ రియాక్షన్ ఏంటి?

కోలీవుడ్ స్టార్ హీరోగా నిర్మాతగా సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న టాలెంటెట్ హీరో ధనుష్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన సతీమణితో వివాహ బంధానికి తెగదెంపులు చేసుకుంటున్నట్లు చాలా సున్నితంగా క్లారిటీ ఇచ్చేశారు. అర్ధరాత్రి ఈ విషయం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 18 ఏళ్ళు కలిసి ఉన్న ఈ జంట విడాకులు ఎందుకు తీసుకుంది. అసలు విడాకుల ప్రకటనకు ముందు ఏం జరిగింది అని విషయాలపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

చిన్న వయసులో పెళ్లి

చిన్న వయసులో పెళ్లి

ఐశ్వర్య.. రజినీకాంత్ పెద్ద కూతురు. ఆమె 23 ఏళ్ల వయసులో ధనుష్ ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో ధనుష్ వయసు కేవలం 21 మాత్రమే. ఇక వీరి పెళ్లి అనంతరం ధనుష్ పై చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి. అయినప్పటికీ ఐశ్వర్య ధనుష్ విషయంలో పాజిటివ్ గానే ఉంది. ఆమె దాంపత్య విషయంలో సమస్యలను సున్నితంగానే పరిష్కరించుకొని ముందుకు సాగారు.

ఇద్దరు పిల్లలు..

ఇద్దరు పిల్లలు..

ధనుష్ నిర్మాత, దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు. వారి పెద్ద కుమారుడు సెల్వా రాఘవన్ కూడా మంచి దర్శకుడిగా గుర్తింపు అందుకున్నారు. ఇక ఐశ్వర్య 2004లో ఆరు నెలలకు పైగా పరిచయమైన తర్వాత అదే ఏడాది నవంబర్ 18న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు యాత్రా, లింగ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. 2006లో యాత్ర జన్మించగా.. 2010లో లింగా జన్మించాడు.

గతంలో గొడవలు

గతంలో గొడవలు

ఇక ఈ ఇద్దరు కూడా ఫ్యామిలీ లైఫ్ ను అలాగే మరోవైపు సినిమా కెరీర్ ను కూడా చాలా బ్యాలెన్స్ గా తీసుకువెళుతు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉండేవారు. మధ్యలో సమస్యలు గొడవలు ఎదురైనప్పుడు రజనీకాంత్ దంపతులు సమక్షంలో పరిష్కారాలు జరిగేవి. వివధాలు ఏ మాత్రం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వచ్చారు.

15 రోజులకు ముందే..

15 రోజులకు ముందే..

విడాకుల ప్రకటనకు 15 రోజులకు ముందే ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు కూడా వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా హ్యాపీగా చేసుకున్నారు. మొన్న ఒక పార్టీలో ధనుష్ భార్య కోసం ప్రత్యేకంగా రొమాంటిక్ పాట కూడా పాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాడు. అంతే కాకుండా సార్ సినిమా లాంచ్ కోసం ధనుష్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఐశ్వర్య కూడా అతని దగ్గరే ఉంది.

అధికారిక ప్రకటన

ఇక మొత్తానికి అర్ధరాత్రి ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్లుగా ప్రకటన ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు కూడా వారి వ్యక్తిగత ఇష్టంతోనే విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ విషయంలో అభిమానుల నుంచి అలాగే మీడియా నుంచి కూడా ప్రైవసీ కావాలని కోరారు.

Recommended Video

Rowdy Baby Hits 1 Billion Views, Dhanush, Sai Pallavi Tweets
రజనీకాంత్ రియాక్షన్ ఏంటి?

రజనీకాంత్ రియాక్షన్ ఏంటి?

ఇక ధనుష్ , ఐశ్వర్య ఎప్పుడు సమస్య వచ్చినా కూడా రజనీకాంత్ జోక్యంతో అవి పెద్దగా అయ్యేవి కావు. కానీ ఈసారి వాళ్ళు బలమైన నిర్ణయం తీసుకోవడంతో ఆయన కూడా వారి వ్యక్తిగత నిర్ణయానికి ఒప్పుకోక తప్పడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో రజనీకాంత్ ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X