త్రివిక్రమ్ క్రేజీ ఐడియా.. స్టార్ హీరోయిన్‌ను విలన్‌గా.. స్టైలిష్ స్టార్‌తో టఫ్ ఫైట్!
Recommended Video
అరవింద సమేత బ్లాక్ బస్టర్ విజయం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జతకట్టి రూపొందిస్తున్న చిత్రం పట్టాలెక్కింది. సాధారణంగా హీరోయిన్లకు బలమైన పాత్రలను డిజైన్ చేసే త్రివిక్రమ్ తాజా చిత్రం కోసం ఇద్దరు ముద్దుగుమ్మలను బరిలోకి దించుతున్నారట. ఇప్పటికే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపిక కాగా, మరో హీరోయిన్‌గా హన్సిక పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే ఈ పాత్ర గురించిన సమాచారం మీడియాలో ఆసక్తిని రేపుతున్నది. ఇంతకు ఈ సినిమాలో హన్సిక ఎలాంటి పాత్రను చేయబోతున్నదంటే..

త్రివిక్రమ్ మూవీస్‌లో హీరోయిన్లు
త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలను పరిశీలిస్తే ప్రతీ చిత్రంలోనూ మహిళల పాత్రలు చాలా అర్ధవంతంగా ఉంటాయి. అరవింద సమేతలో పూజా హెగ్డే, ఇతర పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే అఆలో అనుపమా పరమేశ్వరన్, నదియా, అజాతవాసిలో ఖుష్భూ, అలాగే అత్తారింటికి దారేదిలో నదియా, సమంత తదితర పాత్రలు కథకు బలంగా ఉంటాయనడంలో సందేహం అక్కర్లేదు.

హన్సిక పవర్‌ఫుల్ పాత్రలో
ఇక సైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ రూపొందిస్తున్న తాజా చిత్రంలో కూడా హన్సికకు అలాంటి పాత్రనే డిజైన్ చేశారంటా. ఈ చిత్రంలో హన్సిక తొలిసారి విలన్‌గా కనిపించనున్నట్టు ఫిలిం నగర్ సమాచారం. పూర్తిగా హన్సికది నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్ర అని ఓ వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

హీరోయిన్ హన్సిక గ్రీన్ సిగ్నల్
గత కొద్దికాలంగా తమిళ సినిమా రంగానికి పరిచయమైన హన్పిక మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాబోతున్నది. త్రివిక్రమ్ చెప్పిన కథ విన్న వెంటనే హన్సిక ఆ పాత్రను చేసేందుకు ముందుకొచ్చిందట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నందున ఆమె పేరును యూనిట్ వెల్లడించడానికి వేచి చూస్తున్నారట. అన్ని అంశాలపై క్లారిటీ వచ్చిన తర్వాత అధికారికంగా హన్సిక పేరు వెల్లడించే అవకాశం ఉంది.

అల్లు అర్జున్‌తో హన్సిక రెండోసారి
ఇక అల్లు అర్జున్‌తో హన్సిక గతంలో దేశముదురు చిత్రంలో కలిసి నటించింది. ఆ సినిమా టాలీవుడ్‌లో మంచి బ్రేక్‌ను సొంతం చేసుకొన్నది. ఒకవేళ అన్ని సరిగ్గా కుదిరితే స్టైలిష్ స్టార్‌తో మళ్లీ రెండో సినిమా అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గ్లామర్‌తో ఆకట్టుకొన్న బొద్దుగుమ్మ విలన్‌గా ఎలా మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే.

నటీనటులు, సాంకేతిక వర్గం
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ (చినబాబు)
సినిమాటోగ్రఫి: పీఎస్ వినోద్
మ్యూజిక్: ఎస్ థమన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
స్టంట్స్: రామ్ లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పీడీవీ ప్రసాద్
బ్యానర్: హరికా అండ్ హాసిని, గీతా ఆర్ట్స్


Click it and Unblock the Notifications











