మాజీ మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్.. ఆ రీమేక్ లో లక్కీ ఛాన్స్?
నాగార్జున చివరిగా వైల్డ్ డాగ్ అనే సినిమాతో ఒక మాదిరి హిట్టు అందుకున్న ఆయన.. తర్వాత చేసిన ది ఘోస్ట్ భారీ డిజాస్టర్ కావడంతో డీలా పడిపోయాడు. వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ వంటి వాళ్ళు సైతం మంచి కథలు ఇచ్చుకుంటూ దూసుకుపోతుంటే... నాగార్జున మాత్రం ప్రయోగాల పేరుతో కొత్త వాళ్లకు అవకాశాల ఇచ్చే పేరుతో తన కెరీర్ ని ఇబ్బందుల పాలు చేసుకున్నాడు.
ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆయన మరోసారి వింటేజ్ లుక్ లో ఒక పాత రొటీన్ రోడ్డ కొట్టుడు కమర్షియల్ ఫార్ములా ఫిలిం చేయడానికి సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది. ధమాకా, సినిమా చూపిస్త మావా, నేను లోకల్ వంటి సినిమాలకు రచయితగా వ్యవహారించిన ప్రసన్నకుమార్ బెజవాడ నాగార్జునతో ఒక సినిమా డైరెక్ట్ చేసి దర్శకుడిగా మారాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన కథ చర్చలు పూర్తయ్యాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఇది ఒక మలయాళ రీమేక్ సినిమా అనే ఒక ప్రచారం ఉండగా... కాదని నాగార్జున కోసం ప్రసన్నకుమార్ కొత్త కథ సిద్ధం చేసుకున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమా నటీనటులను కూడా హైలెట్ చేసే దశలో ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే నాగార్జునతో కలిసి ఒక కొత్త భామ ఫోటోషూట్ లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఆమె మరెవరో కాదు మిస్ ఇండియాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న హైదరాబాద్ కు చెందిన మానస వారణాసి. తెలుగు సినిమాలలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆమె నాగార్జున సినిమా అయితే తనకు పర్ఫెక్ట్ లాంచ్ అని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే నాగార్జున వయసు ప్రస్తుతం 60 ఏళ్లు పైపడ్డాయి. కానీ మానస వారణాసి వయసు మాత్రం 25 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి దాదాపుగా రెండింతలు వయసు ఉన్న వ్యక్తి పక్కన ఆమె నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











