దటీజ్ పవన్ కల్యాణ్.. కళ్లు చెదిరే ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన పవర్ స్టార్!

Recommended Video

Pawan Kalyan Rejected Satyameva Jayate TV Show Offer | Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దృష్టంతా వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపైనే ఉంది. గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ప్రజా క్షేత్రంలో బిజీగా ఉన్నారు. రాజకీయాల్లో కొనసాగుతుండగా, లెక్కలేనన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ సామాజిక అంశాలతో కూడిన ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాలని వచ్చిన ఆఫర్‌ను కూడా రిజెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

 సత్యమేవ జయతే కార్యక్రమానికి

సత్యమేవ జయతే కార్యక్రమానికి

హిందీలో ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమైన సత్యమేవ జయతే అనే కార్యక్రమానికి బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ కార్యక్రమానికి అన్ని భాషల్లో విశేష స్పందన వచ్చింది. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ సాగే ఆ కార్యక్రమం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం సుమారు అన్ని భాషల్లో ప్రసారమైంది.

పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు

పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు

సత్యమేవ జయతే కార్యక్రమానికి ఉన్న ప్రజాదరణను బట్టి నేరుగా తెలుగులో ఆ కార్యక్రమాన్ని రూపొందించాలని అనుకొన్నారు. ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా పవన్ కల్యాణ్ అయితే బాగుంటుందని సదరు ఛానెల్ యాజమాన్యం భావించారట. దాంతో పవన్ సంప్రదించగా అందుకు ఆయన నిరాకరించారనేది తాజా సమాచారం.

 భారీ రెమ్యునరేషన్‌ను రిజెక్ట్

భారీ రెమ్యునరేషన్‌ను రిజెక్ట్

సత్యమేవ జయతే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తే భారీగా రెమ్యునరేషన్ ఇస్తామంటూ సదరు చానెల్ ముందుకొచ్చిందట. అయినా పవర్ స్టార్ డబ్బుకు లొంగిపోకుండా ప్రజల కోసమే తన జీవితాన్ని అంకింత చేయాలని నిర్ణయం తీసుకొన్నారట. పవన్ క్రేజీ రెమ్యునరేషన్ వదులుకోవడం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

పవన్ రిజెక్ట్ .. మరో హీరో కోసం వేట

పవన్ రిజెక్ట్ .. మరో హీరో కోసం వేట

పవన్ కల్యాణ్ నిరాకరించడంతో తెలుగులో మరో స్టార్ హీరో కోసం టెలివిజన్ ఛానెల్ వెతుకుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు హీరోలను సంప్రదించినట్టు తెలిసింది. అయితే సత్యమేవ జయతే లాంటి ప్రజాదరణ పొందిన కార్యక్రమానికి ఎవరు హోస్ట్‌గా వ్యవహరిస్తారనే అనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

మాతో పవన్ సినిమా చేయడం గ్యారెంటీ

మాతో పవన్ సినిమా చేయడం గ్యారెంటీ

ఇదిలా ఉండగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత సినిమా రంగానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో క్రియాశీలకంగా మారకముందు మైత్రీ మూవీ మేకర్స్ వద్ద సినిమా కోసం అడ్వాన్సు తీసుకొన్నారు. ఇటీవల మైత్రీ నిర్మాతలు మాట్లాడుతూ.. పవన్ మాకు ఓ సినిమా చేస్తారు. అది ఎప్పుడన్నది కాలమే నిర్ణయిస్తుంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X