Prabhu Daughter Marriage: స్టార్ డైరెక్టర్‌తో ప్రముఖ నటుడు ప్రభు కూతురు రెండో పెళ్లి.. ఎప్పుడో తెలుసా?
డార్లింగ్, చంద్రముఖి, తూనీగా తూనీగా, మిస్టర్ ప్రేమికుడు, నేనే వస్తున్నా, రంగా రంగా వైభవంగా వంటి సినిమాల్లో తండ్రి పాత్ర పోషించిన నటుడు ప్రభు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 66 ఏళ్ల వయసు కల్గిన ఈయన ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించారు. కేవలం తెలుగు, తమిళ్ లోనే కాకుండా మలయాళ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాలు చేశాడు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈయనకు.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముందుగా కొడుకు పుట్టగా.. ఆయన విక్రం ప్రభు. ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలు చేస్తున్నాడు. ఇక రెండో ఆమె కూతురు. ఆమె పేరే ఐశ్వర్యా ప్రభు.
ఐశ్వర్యా ప్రభుకు గతంలోనే ఓసారి వివాహం జరిగింది. తమ దగ్గరి బంధువు అయిన కునాల్ అనే వ్యక్తితో 2009లో వైభవంగా పెళ్లి జరిపించాడు నటుడు ప్రభు. ఆ తర్వాత భర్తతో పాటు అమెరికా వెళ్లిపోయి ఆమె అక్కడే స్థిరపడిపోయింది. కానీ ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం.. విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి ఐశ్వర్య ఇండియాలోనే ఉంటుంది. తండ్రి వద్దే ఉంటూ కాలం గడుపుతోంది. అయితే తన సోదరుడు విక్రమ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ఇరుకప్పపుట్టు. తన అన్న సినిమా షూటింగ్ సమయంలో ఐశ్వర్య కూడా అప్పుడప్పుడూ అక్కడకు వెళ్లేది.

ఈక్రంలోనే ఈ సినిమా డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో ఆమెకు స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరి ప్రేమ గురించి ఐశ్వర్య ఇంట్లో కూడా చెప్పి ఒప్పించిందట. ఈక్రమంలోనే త్వరలోనే వీరిద్దరి పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కూతురు ప్రేమ విషయం తెలుసుకున్న ప్రభు కూడా వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పటికే ఓసారి కూతురు పెళ్లి వర్కౌట్ కాకపోవడం.. ఇప్పుడు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో చాలా సంతోషంగా ఉన్నారట.
ముఖ్యంగా డైరెక్టర్ రవిచంద్రన్ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పారట. దాంతో ఇరుకుటుంబాలు కలిసి ఇటీవలే వీరిద్దరికీ నిశ్చాతర్థం కూడా చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే అంటే డిసెంబర్ 15వ తేదీనే వీరి పెళ్లి జరగబోతున్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే ప్రభు తన కూతురు పెళ్లి గురించి అధికారిక ప్రకటన చేయనున్నారని కూడా సమాచారం. చూడాలి మరి కూతురు పెళ్లి గురించి ఆయన ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది.

అయితే ఐశ్వర్యా ప్రభును పెళ్లి చేసుకోబోతున్న డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్.. త్రిఫ ఇల్లానా నయనతార, అన్బానవర్ అసరాధవన్ అడంగాధవన్ సినిమాలకు డైరెక్టర్ గా పని చేస్తూనే అతిథి పాత్రలో కనిపించారు. అలాగే దబాంగ్ 3 సినిమాకు రచయితగా (తమిళంలో మాత్రమే) పని చేశారు. బగీరా, మార్క్ ఆంటోని చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే కే-13, నేర్కొండ పార్వై, నాగుపాము వంటి చిత్రాల్లో నటుడిగానూ కనిపించాడు.


Click it and Unblock the Notifications











