రాజశేఖర్‌తో చేతులు కలిపిన అల్లు అరవింద్.. మెగాస్టార్‌పై కోపంతోనే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా రాజశేఖర్, మెగాస్టార్ చిరంజీవి మధ్య విబేధాలు ఉన్నాయని ఆ మధ్య మా మీటింగ్ లోనే బయటపడింది. చిరంజీవి చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా రాజశేఖర్ మాట్లాడటం అప్పట్లో అందరిని షాక్ కి గురి చేసింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య విబేధాలు కూడా ఉన్నాయని ఇటీవల బాలకృష్ణ కామెంట్స్ తో మరోసారి ఋజువయ్యింది. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మెగా బంధువు అల్లు అరవింద్ రాజశేఖర్ తో ఒక సినిమాకు సంబంధించి చేతులు కలపడం హాట్ టాపిక్ గా మారింది.

రాజశేఖర్‌తో అల్లు అరవింద్..

రాజశేఖర్‌తో అల్లు అరవింద్..

గత కొన్ని నెలల క్రితం మా అసోసియేషన్ కి సంబంధించి ఒక ఈవెంట్ లో మెగాస్టార్ - రాజశేఖర్ మధ్య ఎలాంటి వాతావరణం కొనసాగిందో అందరికి తెలిసిందే. ఒక విధంగా రాజశేఖర్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచి విమర్శలపాలుచేశాయి. అయితే ఇప్పుడు నిర్మాత అల్లు అరవింద్ రాజశేఖర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో కావాలనే ఈ విదంగా చేస్తున్నారని మరో టాక్ వైరల్ గా మారింది.

రాజశేఖర్ త్వరలోనే..

రాజశేఖర్ త్వరలోనే..

రాజశేఖర్ త్వరలోనే ఒక రీమేక్ సినిమాతో బిజీ కానున్నాడు. మలయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన మెడికల్ బ్యాక్ డ్రాప్ థ్రిల్లర్ మూవీ జోసెఫ్. ఈ సినిమాలో రాజశేఖర్ ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఆడియెన్స్ ని షాక్ కి గురి చేస్తోంది.

గీత ఆర్ట్స్ 2 బ్యానర్..

గీత ఆర్ట్స్ 2 బ్యానర్..

ఆ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో మీడియం బడ్జెట్ లో సినిమాను గ్రాండ్ గా నిర్మించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ ఆ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందట. గతంలోనే ఈ దర్శకుడికి అల్లు అరవింద్ ఈ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ అందులో రాజశేఖర్ నటిస్తున్నాడు అని ఎవరు ఊహించలేదు.

Recommended Video

Chiranjeevi And Balakrishna Together At Kodi Ramakrishna Daughter's Marriage
అఫీషియల్..

అఫీషియల్..

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం దాదాపు ఈ కాంబినేషన్ సెట్టయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ రాజశేఖర్ మధ్య విబేధాలు ఉన్నాయని అందరికి ఒక క్లారిటీ వచ్చిన అనంతరం ఈ విధంగా అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో రాజశేఖర్ హీరోగా చేయడం అనేది హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X