»   » స్టార్ హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి?.. పవన్ కల్యాణ్ దారిలోనే..

స్టార్ హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి?.. పవన్ కల్యాణ్ దారిలోనే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sai Dharam Tej's Marriage With Star Heroineస్టార్ హీరోయిన్‌తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి|

హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు టాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. తనతో నటించిన జీవితను రాజశేఖర్, అమలను నాగార్జున పెళ్లి చేసుకొని చక్కటి వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి హీరోలు యువతరానికి ఆదర్శంగా నిలిచారు. తనతో నటించిన రేణూ దేశాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అయితే వారిద్దరూ ప్రస్తుతం వేర్వేరుగా జీవిస్తున్నప్పటికీ, వారి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి.

ప్రేమ పెళ్లి విషయంలో పవన్ కళ్యాణ్ దారిలోనే ఆయన ముద్దుల మేనల్లుడు నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. స్టార్ హీరోయిన్‌తో సాయి ధరమ్ సాగిస్తున్న అఫైర్ పెళ్లి వరకు వచ్చినట్టు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సాయి ధరమ్ తేజ్ ప్రేమ వ్యవహారంలో ఏమి జరుగుతున్నదంటే..

నాగబాబు కుమార్తె నిహారికతో ..

నాగబాబు కుమార్తె నిహారికతో ..

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ అప్పట్లో మీడియాను ఓ వార్త కుదిపేసింది. రూమర్ వార్తతో మీడియాలో రోజంతా అనేక కథనాలు వెలువడ్డాయి. సాయి ధరమ్ తేజ్, నిహారిక పెళ్లిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. కానీ సాయి ధరమ్ తేజ్‌తో అలాంటిది ఏమీ లేదని ఓ ప్రకటన ఇప్పించడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

హీరోయిన్ రెజీనాతో పీకల్లోతు ..

హీరోయిన్ రెజీనాతో పీకల్లోతు ..

కానీ ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడనే వార్త సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నది. వీరిద్దరూ కలిసి వరుస చిత్రాల్లో నటించడంతో అప్పుడే ఓ రూమర్ పుట్టుకొచ్చింది. అయితే అలాంటిదేమీ లేదు.. మా మధ్య మంచి స్నేహం మాత్రమే ఉంది. ప్రేమకు చోటు లేదు అని వివరణ ఇచ్చారు. వరుసగా సినిమాలు చేస్తే రిలేషన్ ఆపాదించడం సరికాదన్నారు.

పిల్లా నువ్వులేని జీవితం అంటూ..

పిల్లా నువ్వులేని జీవితం అంటూ..

అయితే 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రం షూటింగ్ సందర్భంగా సాయి ధరమ్ తేజ్, రెజీనా లిద్దరూ ప్రేమలో పడిపోయారట. వారిద్దరు కలిసి నటించిన రెండో సినిమా 'సుబ్రమణ్యం ఫర్ సేల్' షూటింగ్ సమయంలో ఇద్దరూ మరింత దగ్గరయ్యారట. ఆ సమయంలో వారిద్దరూ ఒకర్నొకరు విడిచి ఉండలేని పరిస్థితి ఏర్పడటంతో తమలో స్నేహానికి మించి ఏదో బంధం ఉందని గ్రహించారట.

సుబ్రమణ్యం ఫర్ సేల్ సమయంలో ..

సుబ్రమణ్యం ఫర్ సేల్ సమయంలో ..

అమెరికాలో సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం షూటింగ్ సమయంలో ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారనేది ఈ అఫైర్ లో కీలక విషయం. అయితే మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని రెజీనా ఓ సందర్భంలో తమ ప్రేమను దాచడానికి ప్రయత్నించింది. అయితే రెజీనాను పెళ్లి చేసుకోవాలని సాయిధరమ్ తేజ్ బలంగా ఫిక్సయ్యాడట.

వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని..

వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని..

రెజీనాతో ప్రేమ విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. తన తల్లిని, కుటుంబ సభ్యులను ఒప్పించే పనిలో పడినట్టు సమాచారం. ఏది ఏమైనా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని సాయి ధరమ్ తేజ్ భావిస్తున్నాడనేది సన్నిహితుల ద్వారా బయటకు వచ్చింది. అయితే ఈ పెళ్లి విషయంలో రెజీనా మెలిక పెట్టినట్టు మరో వార్త వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికిప్పుడు పెళ్లంటే కష్టం..

ఇప్పటికిప్పుడు పెళ్లంటే కష్టం..

కెరీర్ పీక్‌లో ఉన్నందున్న మరికొన్ని రోజులు ఆగుదామనే ప్రతిపాదన సాయిధరమ్ ముందుకు రెజీనా తెచ్చిందట. ఇప్పటికిప్పుడు పెళ్లంటే కష్టమని చెప్పేసిందట. ఈ విషయంలో ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. సాయిధరమ్ తేజ్ మాత్రం ఎలాగైనా రెజీనాని ఒప్పించి, తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి పీటలెక్కేయాలనుకుంటున్నాడట. అయితే సాయి జోష్ కు రెజీనా ఆమోదం తెలుపుతుందా అనేది వేచి చూడాల్సిందే.

English summary
Hero Sai Dharam Tej's love affair with Regina cassandra now talk of the Tollywood. According to Reports, Bothe are in deep love. In this junxture, Sai Dharam wants marry Regina next year. But Regina opposing to marry Sai because her career. Both are in discussion for marriage proposal with their family members now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu