విజయ్ భాస్కర్ లేటెస్ట్ చిత్రం హీరో ఆ కుర్రాడా
విజయ్ భాస్కర్ దాదాపు రెండేళ్ళ విరామం తర్వాత రూపొందిస్తున్న కొత్త చిత్రానికి హీరోగా ఆది పరిచయమవుతున్నారంటూ అని వార్తలు వచ్చాయి. ఆది మరెవరో కాదు డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు. అప్పట్లో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేసారు. కానీ అతను కిక్ చిత్రం చేయటంతో ఈ ప్రాజెక్టు వెనక్కి వెళ్ళింది. దాంతో ఇప్పుడు కె.అచ్చిరెడ్డి ఇప్పుడు మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే నూతన నిర్మాణ సంస్థను స్థాపించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలైలో ఈ భారీ చిత్రాన్ని ప్రారంభంకానుంది. ఈ సినిమా గురించి కె.అచ్చిరెడ్డి చెబుతూ 'విజయభాస్కర్ దర్శకత్వంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఓ మంచి చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కథ సిధ్దమైంది. ఈ చిత్రం ద్వారా ఆది అనే కొత్త హీరోని పరిచయం చేస్తున్నాం' అని తెలిపారు.
సాయికుమార్ ఆది కిక్ నువ్వు నాకు నచ్చావ్ మన్మథుడు మల్లీశ్వరి విజయ్ భాస్కర్ స్వయంవరం నువ్వే కావాలి saikumar vijaya bhaskar swayamvaram manmadhudu malleswari


Click it and Unblock the Notifications