లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే..
కరోనావైరస్ లాక్‌డౌన్ పుణ్యమా అని టాలీవుడ్ హీరోల పెళ్లిళ్లు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. ఇక మరి కొంత మంది యువ హీరోల పెళ్లిళ్లు కూడా త్వరలోనే జరుగడానికి ఏర్పాట్లు మొదలయ్యాయనే వాద్తలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే యువ హీరో శర్వానంద్ పెళ్లికొడుకు కాబోతున్నారనే వార్త బలంగానే వినిపిస్తున్నది. ఇంతకు శర్వానంద్‌కు కాబోయే భార్య ఎవరంటే..
Recommended Video

వివాహితుల జాబితాలో రానా, నిఖిల్, నితిన్
టాలీవుడ్‌లో ఊహించని విధంగా రానా దగ్గుబాటి, నిఖిల్, నితిన్ అలాంటి హీరోలు బ్రహ్మచారుల జాబితా నుంచి వివాహహితుల జాబితాలోకి చేరిపోయారు. ఇక బ్యాచిలర్స్‌గా మిగిలిపోయిన ప్రుభాస్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి యువ హీరోలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ల గురించి చర్చ జీరుగుతుంటే సడెన్‌గా శర్వానంద్ పెళ్లి తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

బాల్య స్నేహితురాలితో వివాహం
శర్వానంద్ తన బాల్య స్నేహితురాలితో కొద్దికాలంగా సన్నిహితంగా ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్త గురించి చర్చ జరగకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల తన ప్రేమను పెళ్లిగా మార్చే ప్రయత్నం చేపట్టిన శర్వానంద్ సఫలమయ్యారని, తన స్నేహితురాలిని పెళ్లికి ఒప్పించినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై సినీ వర్గాలు క్లారిటీ ఇస్తున్నారు.

ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్
తన స్నేహితురాలితో శర్వానంద్ ప్రేమ ఇంటి పెద్దల దృష్టికి తీసుకెళ్లడం అందుకు వారు ఓకే చెప్పడం కొద్ది రోజుల క్రితం చకచకా జరిగిపోయాయని స్నేహితులు చెప్పుకొంటున్నారు. అంతేకాకుండా తన ప్రియురాలి కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇలాంటి సమస్య లేకుండా పెళ్లికి లైన్ క్లియర్ అయిపోయినట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో
ఇక శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బిజినెస్ రంగంలో ప్రముఖమైన ఫ్యామిలీకి సంబంధించినట్టు తెలిసిందే. శర్వానంద్ కాబోయే భర్య బిజినెస్‌లో సెటిల్ అయ్యారని, యువ మహిళా వ్యాపారవేత్తగా పేరు కూడా సంపాదించుకొన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ పెళ్లి విషయాన్ని శర్వానంద్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

శర్వానంద్ కెరీర్ ఇలా..
ఇక శర్వానంద్ కెరీర్ విషయానికి వస్తే.. గత ఏడాదిలో వచ్చిన రణరంగం, జాను చిత్రాలు బాక్సాఫీస్ వద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా జాను సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొన్నప్పటికీ భారీ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ప్రస్తుతం శ్రీకారం, కీరవాణి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై మరో చిత్రంలో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











