నిర్మాతలను కంగారు పెడుతున్న సోనూసూద్ రెమ్యునరేషన్.. వామ్మో మరీ అంత ఎక్కువనా..?

గత ఏడాది కరోనా వైరస్ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా సోనూసూద్ అలుపెరగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ కష్టకాలంలో ప్రభుత్వం చేయాల్సిన ఎన్నో పనులను సోనూసూద్ ఒంటరిగా చేశాడు. ఇప్పటికి అలానే చేస్తున్నాడు. ఇక అతను చేసిన సహాయల వల్ల అతని యాక్టింగ్ కెరీర్ పై ప్రభావం గట్టిగానే పడింది. ఇక ప్రస్తుతం రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.

గత ఏడాదికి ముందు..

గత ఏడాదికి ముందు..

కెరీర్ మొదటి నుంచి సోనూసూద్ ఎక్కువగా నెగిటివ్ విలన్ క్యారెక్టర్స్ తోనే క్రేజ్ అందుకుంటూ వచ్చాడు. సినిమాలకు అతని పాత్రలో బాగా హెల్ప్ అయ్యేవి. పాజిటివ్ పాత్రలు చేసింది చాలా తక్కువే. ఎలాంటి సినిమా చేసినా కూడా సోనూసూద్ గత ఏడాది ముందు వరకు 2కోట్లకు పైగా పారితోషికం అందుకుంటూ వచ్చాడు.

ఎప్పుడైతే అలా చేయడం స్టార్ట్ చేశాడో

ఎప్పుడైతే అలా చేయడం స్టార్ట్ చేశాడో

ఇక సోనూసూద్ గత ఏడాది నుంచి పెద ప్రజలకు వివిధ రకాలుగా సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే సోనూసూద్ హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి జనాల్లో రియల్ హీరోగా ట్యాగ్ ను అందుకున్నాడు. దీంతో అప్పటివరకు సెలెక్ట్ అయిన సినిమాల్లో దర్శకులు సోనూసూద్ పాత్రలను పాజిటివ్ గా చూపించడం మొదలు పెట్టారు.

హీరోగా ఛాన్సులు

హీరోగా ఛాన్సులు

సోనూసూద్ కు భవిష్యత్తులో విలన్ క్యారెక్టర్లు అంతగా రాకపోవచ్చని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక పాజిటివ్ రోల్స్ అంతగా రాకపోవచ్చని అనుకుంటున్న తరుణంలో ఏకంగా హీరోగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులోనే హీరోగా రెండు ఆఫర్స్ వచ్చాయి. కరోనా వలన ఆ రెండు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయట.

Recommended Video

Sonu Sood To Set Up Oxygen Plants In Kurnool, Nellore Hospitals || Filmibeat Telugu
ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎంతంటే?

ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే మొన్నటి వరకు సపోర్టింగ్ రోల్స్ కోసం కూడా సోనూసూద్ 2కోట్ల వరకు డిమాండ్ చేశాడు. ఇక గత కొంత కాలంగా పాత్రలను బట్టి ఏకంగా 7కోట్లు అడుగుతున్నాడట. దీంతో కొంతమంది నిర్మాతలను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సోనూసూద్ కు విరాళాలు ఎంత వస్తున్నా కూడా ఎక్కువగా తన సొంత డబ్బునే ఖర్చు చేస్తున్నాడు. అందుకే రెమ్యునరేషన్ కాస్త పెంచి సమాజానికి ఉపయోగించాలని అనుకుంటున్నాడట. మరి రానున్న రోజుల్లో ఈ నటుడు ఇంకా ఎలాంటి అవకశాలు అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X