మరో రిస్క్ చేయబోతున్న సునీల్.. బాలయ్య సినిమాలో నెగిటివ్ రోల్.. డబుల్ రెమ్యునరేషన్?

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఇక ఒకప్పుడు తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ అనంతరం హీరోగా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే సునీల్ ప్రస్తుతం మళ్ళీ కమెడియన్ గా చేస్తున్నాడు అనుకుంటే.. విలన్ పాత్రలు కూడా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ స్టార్ యాక్టర్ రెమ్యూనరేషన్ డోస్ కూడా పెంచడానే కామెంట్స్ వస్తున్నాయి.

ఆల్ టైమ్ బెస్ట్ కమెడియన్..

ఆల్ టైమ్ బెస్ట్ కమెడియన్..

టాలీవుడ్ ఆల్ టైమ్ బెస్ట్ కమెడియన్స్ లిస్ట్ లో సునీల్ కూడా ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒకానొక దశలో సునీల్ కమెడియన్ గా చాలా బిజీగా ఉండేవాడు. బ్రహ్మానందం తరువాత సునీల్ కూడా సినిమాలో ఉండాల్సిందే అనేలా ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్నాడు. తీరిక లేకుండా సినిమాలు చేస్తూ అప్పటి యువ హీరోల బెస్ట్ కామెడీయన్ పాట్నర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

సక్సెస్ కాలేకపోయాడు..

సక్సెస్ కాలేకపోయాడు..

అయితే కమెడియన్ నుంచి హీరోగా ఎప్పుడైతే ట్రాక్ మార్చాడో సునీల్ ఎక్కువరోజులు సక్సెస్ కాలేకపోయాడు. మర్యాద రామన్న, పూల రంగడు సినిమాల తరువాత ఎన్నో సినిమాలు చేసిన సునీల్ ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. కనీసం యావరేజ్ హిట్స్ కూడా దక్కకపోవడంతో హీరోగా అవకాశాలు తగ్గాయి. దీంతో మళ్ళీ కమెడియన్ గా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు.

నెగిటివ్ పాత్రలో..

నెగిటివ్ పాత్రలో..

కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కమెడియన్ గా సునీల్ సక్సెస్ కావడం లేదు. దీంతో మళ్ళీ రూట్ మార్చాడు అనే రూమర్స్ వస్తున్నాయి. త్వరలో బాలకృష్ణ సినిమాలో ఇక నెగిటివ్ పాత్రలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సునీల్ కీలకాపాత్రలో కనిపించనున్నాడట.

Recommended Video

Actor Sunil Emotional Comments On Uday Kiran
డబుల్ రెమ్యునరేషన్..

డబుల్ రెమ్యునరేషన్..

ఇప్పటికే జగపతిబాబు, ఆది వంటి కూల్ యాక్టర్స్ ని విలన్స్ గా చూపించిన బోయపాటి ఇప్పుడు సునీల్ ని కూడా అదే తరహాలో కొత్తగా చూపించాలని ట్రై చేస్తున్నారట. అందుకోసం అతనికి డబుల్ రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కమెడియన్ గా మూడు లక్షలకు పైగా డైలీ పేమెంట్ అందుకుంటున్న సునీల్ ఇప్పుడు నెగిటివ్ రోల్ కోసం అంతకంటే ఎక్కువగా డబుల్ పెమెంట్ అందుకునే ఛాన్స్ ఉందని టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X