కేఏ పాల్ బయోపిక్ అప్‌డేట్.. ట్రంప్‌ని కూడా లాగేశారు.. ఇక రచ్చ రచ్చే!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ చూసినా బయోపిక్‌ల హవానే కనిపిస్తోంది. ఫేమస్ పర్సనాలిటీస్ జీవిత చరిత్రలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో క్రైస్తవ మత ప్రబోధకుడు, రాజకీయ వేత్త కేఏ పాల్ బయోపిక్ రానుందనే ఆసక్తికర వార్త గత కొద్దిరోజులుగా హల్చల్ చేస్తోంది. ఈ బయోపిక్‌లో టాలీవుడ్ కమెడియన్ సునీల్ నటిస్తున్నాడని తెలిసింది.
గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేఏ పాల్ చేసిన హంగామా అంతాఇంతా కాదు. దీంతో ఆయన బయోపిక్ అనేసరికి ప్రేక్షకుల్లో ఎక్కడాలేని ఆసక్తి నెలకొంది. పైగా కేఏ పాల్ రోల్‌లో సునీల్ నటిస్తున్నాడని తెలుస్తుండటం ఆ ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ సినిమాను నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు.

చిత్రంలో కేఏ పాల్‌గా సునీల్ మేకోవర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుందట. ఈ మేరకు హాలీవుడ్ మేకప్ మ్యాన్ సమక్షంలో సరికొత్తగా మేకోవర్ కానున్నాడట సునీల్. అంతేకాదు ఈ చిత్రంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కనిపించున్నాడని తెలుస్తుండటం మరింత ఆసక్తి రేపుతోంది. ట్రంప్‌ని పోలిన ఓ మనిషిని ఇప్పటికే గుర్తించడం జరిగిందని, ఆయనతోనే ట్రంప్ వేషం వేయించబోతున్నారని తెలిసింది. కేఏ పాల్ బయోపిక్‌కి సంబందించిన అఫీషియల్ ప్రకటన అతి త్వరలోనే రానుందని ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదే జరిగితే కేఏ పాల్ రూపంలో కమెడియన్ సునీల్ చేసే కామెడీ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఇవ్వడం పక్కా.


Click it and Unblock the Notifications











