నన్ను నగ్నంగా చూసినా పర్లేదు.. వైరల్ గా మారిన అనసూయ కామెంట్స్

బుల్లితెరపై యాంకర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తన టాలెంట్ తో టెలివిజన్ రంగంలోని పోటీని తట్టుకొని స్టార్ యాంకర్ గా ఎదిగింది. కొన్నాళ్ల కింద జబర్దస్త్ షోను వీడి పూర్తిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెక్ట్స్ అనసూయ భరద్వాజ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంతో అలరించబోతోంది. ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా అనసూయకు సంబంధించిన ఓల్డ్ ఇంటర్వ్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ డైలాగ్ కూడా వైరల్ అవ్వడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

గ్రౌండ్ నుంచి కష్టపడుతూ..
అనసూయ భరద్వాజ్ చాలా గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తూ ఈ స్థాయికి ఎదిగింది. 15 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో శ్రమించింది. టెలివిజన్ రంగంలో అడుగు పెట్టడాని కంటే ముందు పలు ఉద్యోగాలు కూడా చేసింది. తనకున్న టాలెంట్ తో యాంకర్ గా జబర్దస్త్ లో అవకాశం అందుకుంది. చలాకీ తనం, సందర్భోచితంగా మాట్లాడే తత్వం, రూప సౌందర్యం, యాంకరింగ్ స్కిల్స్, డ్యాన్స్ పెర్ఫామెన్స్ లో తక్కవ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది.

Actress Anasuya Bharadwaj Shocking Comments Goes Viral

అదే సమయంలో వెండితెరపైనా కూడా పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది. సినిమాల విషయంలో ఏమాత్రం తొందర పడకుండా ఎలాంటి పాత్రలు పడితే అలాంటి పాత్రల్లో నటించకుండా అచీతూచీ, తన స్థాయిని పెంచుకునే సినిమాలు, పాత్రల్లో మాత్రమే నటించింది. అలా నటిగా కూడా సక్సెస్ అయ్యింది.

హరి హర వీరమల్లుతో మరోసారి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రంతో అనసూయ భరద్వాజ్ నెక్ట్స్ వెండితెరపై అలరించబోతోంది. హరి హర వీరమల్లు చిత్రంతో మరోసారి స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకోబోతోంది. ఇప్పటికే గతంలో సోగ్గాడే చిన్ని నాయన, సూయ సూయ అనసూయ ప్రత్యేక పాటతో పాటు మరో రెండు స్పెషల్ సాంగ్ ల్లో నటించింది. ఇక చాలా కాలం తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లులో స్పెషల్ సాంగ్ తో అలరించబోతోంది. 'కొల్లగొట్టినాదిరో' అనే పాటతో ఆకట్టుకోబోతోంది. ఈ చిత్రం జూలై 24న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.

అనసూయ కామెంట్స్ ను వైరల్ గా మార్చి..
అనసూయ భరద్వాజ్ టెలివిజన్, వెండితెర ఎంత యాక్టివ్ గా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూనే ఉంటుంది. పలు ఇంటర్వ్యూలతోనూ ముక్కు సూటిగా సమాధానాలు ఇస్తూ ఆలోచింపజేస్తుంది. అయితే తన రీసెంట్ ఫిల్మ్ 'రాజాకార్'లోని ఓ మాస్ డైలాగ్ ను ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 'నా మొగుడు తప్ప నన్ను ఎవ్వరు నగ్నంగా చూసినా పర్లేదు. ఎందుకంటే మిగితా వాళ్లంతా నాకు అన్న తమ్ముడితో సమానం. వాళ్లు చూసిన ఏం కాదు' అనే డైలాగ్ ను చెప్పింది. అయితే ఆ డైలాగ్ మాత్రమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కేవలం ఆమె సినిమాలోని డైలాగ్ కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X