మరో పవర్ ఫుల్ పాత్రలో అనసూయ?.. రాయలసీమ డేరింగ్ లీడర్‌గా..

By Bojja Kumar

Recommended Video

Anasuya Is Playing A Key Role In YSR Biopic 'Yatra'

'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్త లాంటి పవర్ ఫుల్ పాత్రలో అనసూయ నటన సినిమాకే హైలెట్ అయింది. ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అనసూయ దశ తిరిగిందని చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తినా సెలెక్టెడ్‌గా పాత్రలు ఎంచుకుంటోంది. తాజాగా అనసూయకు రంగస్థలం తరహాలోనే పవర్ ఫుల్ పాత్ర చేసే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'యాత్ర'లో ఈ హాట్ యాంకర్ ఎంపికైనట్లు సమాచారం.

పవర్ ఫుల్ మహిళా నేతగా అనసూయ?

పవర్ ఫుల్ మహిళా నేతగా అనసూయ?

‘యాత్ర'లో మూవీలో కర్నూలు జిల్లాకు చెందిన పవర్ ఫుల్ మహిళా నేత పాత్ర కోసం అనసూయను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కాదని, అతిథి పాత్ర మాత్రమే అని టాక్. అయితే ఈ విషయమై దర్శక నిర్మాతల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

ఎవరి పాత్రలో..?

ఎవరి పాత్రలో..?

వైఎస్ఆర్ హయాంలో కర్నూలు జిల్లాలో బలమైన మహిళా నేతగా శోభా నాగిరెడ్డి చక్రం తిప్పారు. అనసూయ కర్నూలు జిల్లా మహిళా నేత పాత్రలో కనిపించబోతోందనే వార్తలు తెరపైకి రాగానే.... అది శోభా నాగిరెడ్డి పాత్ర అయుండొచ్చు అనే చర్చ మొదలైంది.

ఇతర పాత్రల్లో

ఇతర పాత్రల్లో

మ‌హి.వి.రాఘ‌వ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ళయాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్నారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ పాత్రలో 'బాహుబలి' ఫేం అశ్రితా వేముగంటి. వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి, వైఎస్ ప్రాణ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు పాత్రలో రావు రమేష్‌, వైఎస్ఆర్ హయాంలో హోం మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని ఎంపికయ్యారు.

సినిమాలో హైలెట్‌గా చూపించే అంశాలు

సినిమాలో హైలెట్‌గా చూపించే అంశాలు

యాత్ర' సినిమాలో ఎక్కువగా వైఎస్ ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్రను ఫోకస్ చేయబోతున్నారు. వైఎస్ఆర్ 60 రొజుల్లో 1500 కిలోమీట‌ర్లు కాలి న‌డ‌క‌న పాదయాత్ర చేసి పెద‌వాడి క‌ష్టాన్ని, అక్క‌చెల్లెళ్ళ భాద‌ల్ని, రైతుల ఆవేద‌న‌ని కళ్లారా చూశారు. వారి క‌ష్టాల్ని త‌న క‌ళ్ళ‌తో చూసిన ఆయన ముఖ్య‌మంత్రి అయిన వెంటనే రైతుల‌కు ఉచిత క‌రెంటు, విద్యార్థుల‌కి ఫీజు రీ-ఎంబార్సిమెంట్‌, పేద‌వారికి ఆరోగ్య శ్రీ లాంటి ప‌థకాల‌తో పాటు ప్రజలకు మేలు చేసే ఎన్నో ప‌థ‌కాలు ప్రవేశ పెట్టారు. ఇవన్నీ సినిమాలో హైలెట్ కానున్నాయి.

వరుస సినిమాలు, టీవీషోలో అనసూయ బిజీ

వరుస సినిమాలు, టీవీషోలో అనసూయ బిజీ

ఓ వైపు జబర్దస్త్, జాక్ పాట్-2, బ్లాక్ బస్టర్ లాంటి షోలను హోస్ట్ చేస్తూనే..... సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది అనసూయ. ప్రస్తుతం ఆమె సచ్చిందిరా గొర్రె, ఎఫ్2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్, ఎవడో ఒకడు చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X