షకీల బాటలో...హీరోయిన్ అంజలి!?

By Bojja Kumar

హైదరాబాద్: సెక్స్ బాంబ్ షకీల గురించి తెలియని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో? సాధారణ స్థాయి నుండి శృంగార ప్రియుల ఆరాధ్య దేవతగా ఎదిగిన ఆమె సౌతిండియాలో ఒకప్పుడు సంచలనం. ఒకానొక సమయంలో ఆమె స్టార్ హీరోయిన్లకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేంత బిజీబిజీగా గడిపేది.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెంలో పుట్టి..... మళయాల సినిమాల ద్వారా సౌతిండియా సెక్స్ బాంబుగా పేరు తెచ్చుకున్న షకీల జీవితం వెనక ఎన్నో పెద్ద విషాద సంఘటనలు ఉన్నాయి. అందుకు సంబంధించిన విషయాలన్నీ తన ఆత్మకథలో ఇటీవల బయట పెట్టింది షకీల.

Actress Anjali to play Shakeela's role?

షకీల ఆత్మకథ పుస్తకంలోని విషాద సంఘటనలు చదివి చాలా మంది విస్తుపోయారు. కొందరు నిర్మాతలు ఆ పుస్తకాన్ని సినిమాగా మలచడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే ఓ తమిళ నిర్మాత ఆమెను సంప్రదించి సినిమా తీసేందుకు అనుమతి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పాత్ర అంజలితో చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

షకీల ఆత్మకథలో చెప్పిన కొన్ని వివరాలు....
నా గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నేను ఎలాంటి కష్టాలు పడ్డానో ఎవరికీ తెలియదు. నా పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో ఎవరికీ తెలియదు. షకీలాలు ఎలా పుడతారో, ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలనే ఇప్పుడీ ఆత్మకథ రాశాను అంటూ షకీల తన ఆత్మకథను మొదలు పెట్టంది.
నా జీవితాన్ని నాశనం చేసింది మా అమ్మే. బహుశా మా అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే ప్రేమ లేదు. అస్తమాను తిడుతూ ఉండేది. శాపనార్థాలు పెట్టేది. ఇలా నాకు పదహారేళ్లు వచ్చాయి. ఎప్పుడూ నన్ను తిట్టే అమ్మ ఒక రోజు నన్ను పొగిడింది. ఆ తర్వాత- నన్ను ఒక వ్యక్తి వచ్చి బయటకు తీసుకువెడతాడని చెప్పింది. అతను నన్ను ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్తాడనీ.. అతనితో 'మంచి'గా ఉంటే- మొత్తం కుటుంబ ఆర్థిక సమస్యలు తీరిపోతాయనీ చెప్పింది. అతను చెప్పినట్లు చేయాలని మరీమరీ చెప్పింది. నేను షాక్ తిన్నా. మా అమ్మ మాటల వెనకున్న అర్థమేమిటో నాకు బోధపడింది. కానీ నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అమ్మ చెప్పినట్లే ఒక వ్యక్తి వచ్చి హోటల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ రూమ్‌లో ధనవంతుడని మా అమ్మ చెప్పిన వ్యక్తి ఉన్నాడు. అతనిని చూసి నేను బాధతో, భయంతో గడ్డకట్టుకుపోయా. ఆయన నన్ను రేప్ చేశాడు. ఇది ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత అలాంటి ధనవంతులనేకమంది దగ్గరకు నేను వెళ్లాల్సి వచ్చింది. నాకు బాధ కలిగేది. అప్పుడప్పుడు కొంత తృప్తి కూడా కలిగేది. నేను నా కన్యాత్వాన్ని ఎప్పుడు కోల్పోయానో నాకే తెలియదు.

మా పెద్దక్క నూర్జహాన్ నేను దివాళా తీయటానికి ప్రధాన కారణం. ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణిని నేనే. అయినా నా సంపాదనంతా మా అక్క దొంగిలించింది. మా అక్కే నా డబ్బు వ్యవహారాలన్నీ చూసేది. నేను తనని పూర్తిగా నమ్మాను. నా చిన్నప్పటి నుంచి తను నాతోనే ఉంది. ఎప్పుడూ తను అలా ప్రవర్తిస్తుందని నేను ఊహించలేదు. ఒక దశలో నేను ఈ సినిమాలతో విసిగిపోయాను. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్‌కు విమానాల్లో తిరగటం- కంటి మీద కునుకు లేకుండా షూటింగ్‌లు చేయటం నాకు విసుగనిపించాయి. నేను ఒక బ్రేక్ తీసుకుందామనుకున్నా. పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకుంటున్నానని మా అమ్మతోను, నూర్జహాన్‌తోను చెప్పాను. వాళ్లిద్దరూ షాక్ తిన్నారు. బ్రేక్ తీసుకుంటానంటే నేనేదో పెద్ద నేరం చేస్తున్నట్లు చూశారు. నూర్జహాన్ అలాంటి తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చచెప్పటం మొదలుపెట్టింది. వారు కేవలం నా డబ్బునే ప్రేమించారని, నా భవిష్యత్తు మీద వారికి ఎటువంటి ఆలోచన లేదని తేలింది. నాకు చాలా కోపం వచ్చింది. నేను సంపాదించిన డబ్బంతా ఇచ్చేయమన్నా. డబ్బంతా ఇంటికే ఖర్చు పెట్టేసానంది నూర్జహాన్. నాకు షాక్ తగిలినంత పనైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X