Anushka: డైరెక్టర్లకు అనుష్క షాకింగ్ కండిషన్.. జేజమ్మ మాటే శాసనమట!
తెలుగు సినీ తెరపై దేవసేనగా ఇంటర్నేషనల్ రేంజ్ లో నటిగా అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్న అనుష్క సినిమాలను బాగా తగ్గించింది. పైగా తన దగ్గరకు వస్తున్న దర్శకులకు ఒకే ఒక్క కండిషన్ పెడుతోందట. ఆ కండిషన్ కు ఒప్పుకుంటేనే సినిమా చేస్తానని ముఖం మీదే చెప్పేస్తోందట. మరి అనుష్క పెడుతున్న ఆ కండిషన్ పై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
కన్నడ భామ అనుష్క శెట్టి సినిమా రంగంలోకి రాక ముందు యోగా టీచర్ గా పని చేసేది. అనుకోకుండా పూరీ జగన్నాథ్ దృష్టిలో పడడంతో సూపర్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే పడలేదు.

తెలుగు, తమిళం, కన్నడలో వరుస సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా జేజమ్మ ఎదిగిపోయింది. ఆమె ప్రభాస్ తో చేసిన బాహుబలి సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అనుష్క అంటే ఎవరో తెలిసిపోయేలా చేసింది. అయితే ఆ సినిమా తర్వాత ఆమె మరిన్ని సినిమాలు ఒప్పుకుంటుంది అనుకుంటే అందుకు భిన్నంగా చాలా సెలెక్టివ్ గా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది.
బాహుబలి తర్వాత ఆమె భాగమతి అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని సైరా నరసింహారెడ్డి లో చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత నిశ్శబ్దం, మిస్టర్ శెట్టి మిస్ పోలిశెట్టి సినిమాలకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సినిమాల గురించి ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అదేమిటంటే అనుష్క రొటీన్ సినిమాలు చేయడానికి ఇక ఆసక్తి చూపడం లేదని, తాను సినిమా చేయాలంటే కచ్చితంగా అది లేడీ ఓరియంటెడ్ సినిమా అయ్యి ఉండాలని డైరెక్టర్లకు కండిషన్ పెడుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆమె రెండు సినిమాలు చేస్తున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. అందులో ఒకటి ఘాటి. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో నటిస్తుందని ప్రచారం జరుగుతుంది.

మరొక మూవీతో అనుష్క మలయాళ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఆమె కాస్త వెనకడుగు వేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమా కాకపోయినా అందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుష్క. అయితే ఇక మీదట ఎంచుకునే సినిమాల విషయంలో మాత్రం ఆమె ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఇక మీదట రొటీన్ పాత్రలు చేస్తే రేసులో వెనకబడటం సంగతి సరే కనీస గుర్తింపు కూడా ఉండదేమో అనే ఉద్దేశంతోనే ఆమె ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజానిజాల సంగతి దేవుడెరుగు గానీ మొత్తం మీద అనుష్క శెట్టి తీసుకున్న నిర్ణయం ఇటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. కానీ అనుష్క అభిమానులు మాత్రం ఇది వరకు చేసినట్టే ఆమె వరుస సినిమాలు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అనుష్క డెసిషన్ మాత్రం మారట్లేదు.


Click it and Unblock the Notifications











