ఆ ఒక్కరితోనే కాదు.. మొత్తం ఐదుగురు హీరోలతో ఎఫైర్?.. అనుష్క షాకింగ్ కామెంట్స్
గ్లామర్ ఫీల్డ్ అయిన చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య లేనిపోని పుకార్లు, గాసిప్స్ రావడం సహజం. ఏ ఇద్దరు కలిసి ఉన్నా వారి గురించి లేనిపోనివి రాస్తూ వ్యాపింపజేస్తారు పుకారు రాయుళ్లు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఇలాంటి ఘటనలు ఎన్నో. వీటిని పట్టించుకునేవారు కొందరైతే.. చూసి ఆనందించేవాళ్లు మరికొందరు. ఆధునిక యుగంలో సోషల్ మీడియా రాకతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్ధితి నెలకొంది.
అప్పుడెప్పుడో 2005లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు కన్నడ కస్తూరి అనుష్క శెట్టి. తొలుత గ్లామర్ రోల్స్ చేసి అలరించిన ఈ ముద్దుగుమ్మ జీవితాన్ని అరుంధతి చిత్రం మలుపు తిప్పింది. అందులో ఆమె పవర్‌ఫుల్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత సౌత్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారారు స్వీటి. నాటి నుంచి నేటి వరకు నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. సినిమాలు చేసినా చేయకపోయినా అనుష్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

ఆరడుగుల హైట్‌తో , పర్ఫెక్ట్ ఫిగర్‌తో అరేబియన్ గుర్రంలా ఉండే అనుష్క ఫిజిక్‌కు అమ్మాయిల్లోనూ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె లాంటి శరీరాకృతి కావాలని వర్కవుట్స్, యోగా చేస్తూ అందాన్ని కాపాడుకునేవారు ఎందరో. ఇక చిత్ర సీమలోనూ అనుష్కకు బోల్డెంత మంది అభిమానులు ఉన్నారు. మిగిలిన హీరోయిన్ల మాదిరిగా పబ్లిసిటీ కోరుకోకుండా సినిమాలు లేకపోతే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యమిస్తారు అనుష్క శెట్టి. అయితే 40 క్రాస్ చేసి చాలా ఏళ్లే అవుతున్నా ఇప్పటికీ ఈమె పెళ్లి మాట ఎత్తడం లేదు. పలుమార్లు అనుష్క పెళ్లి సెట్ అయినట్లు వార్తలు వచ్చినప్పటికీ అవి గాలి వార్తలుగానే మిగిలిపోయాయి.
అయితే ప్రభాస్ - అనుష్కలు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని దాదాపు పది పదిహేనేళ్లుగా వినిపిస్తూనే ఉంది. 2009లో మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన బిల్లా సినిమాలో తొలిసారిగా ప్రభాస్ - అనుష్క జంటగా నిలిచారు. అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా పుకార్లు వినిపించాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వీరిద్దరూ పలు వేదికలపై క్లారిటీ ఇచ్చారు. ఏం జరిగినా, ఎన్ని వార్తలొచ్చినా.. ప్రభాస్ పెళ్లి అనగానే .. అభిమానులకు, నెటిజన్లకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు అనుష్కనే.

అయితే దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో అనుష్క శెట్టిపై ఎన్నో గాసిప్స్ వైరల్ అయ్యాయి. పలువురు స్టార్స్‌తో ఆమెకు లింక్ పెట్టి దుష్ప్రచారం చేశారు. కొద్దినెలల క్రితం అలనాటి సినీ నటి జయప్రద హోస్ట్ వ్యవహరిస్తూ చేసిన ఇంటర్వ్యూలో ఈ రూమర్స్‌పై అనుష్క స్పందించారు. తనకు ఐదుగురు కో స్టార్స్‌తో పెళ్లిళ్లు చేశారని ఆమె అన్నారు. సుమంత్, గోపీచంద్, ప్రభాస్, సెంథిల్‌తో పాటు మరోకరితో నేను ప్రేమలో ఉన్నానని.. పెళ్లి కూడా చేసుకున్నట్లు గాసిప్స్ వచ్చాయని అనుష్క చెప్పారు. సో.. అదన్న మాట విషయం.


Click it and Unblock the Notifications











