జూలైలో జెనీలియా పెళ్ళి ఆ హీరోతోనే!?
ఇరువైపుల పెద్దల అంగీకారంతోనే జెనీలియా తన బోయ్ ప్రెండ్ రితీష్ దేశముఖ్ ని వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఓ పాపులర్ బాలీవుడ్ మ్యాగజైన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇక ఎంతోకాలంగా వీరి లవ్ ఎఫైర్ పై అనిశ్చితి ఉందని అదిప్పుడు తీరిపోయిందంటూ న్యూ ఇయిర్ వేడుకలు ఇద్దరూ కలిసి ఆనందంగా తమ ఉమ్మడి స్నేహితులకు పార్టీ ఇచ్చారంటూ చెప్తున్నారు. ఇక జెనీలియా తుఝే మేరి కసమ్ చిత్రం(నువ్వే కావాలి రీమేక్) లో తొలిసారిగా రితీష్ సరసన చేసింది. అక్కడ నుంచి డేటింగ్ అంటూ ఇద్దరూ ఖాళీ దొరికినప్పుడల్లా మీడియాకు దొరకకుండా చక్కర్లు కొడుతూనే ఉన్నారు. జెనీలియా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న ఈ సిట్యువేషన్ లో మ్యారేజి గురించి మాట్లాడలేమని అప్పట్లో ఆమె తల్లి అన్నారు. అయితే ఇప్పుడు పరిస్ధితి మారిందని తెలుస్తోంది. ప్రస్తుతం జెనీలియా రామ్ చరణ్ సరసన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తోంది. ఆరెంజ్ అని ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ పెట్టారు.


Click it and Unblock the Notifications











