Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కళ్యాణి పూర్తిగా అప్పులు పాలయిందా?
దర్శకుడు సూర్య కిరణ్ ని వివాహం చేసుకున్న మాజీ హీరోయిన్ కళ్యాణి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తోందని చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పటికే తను నిర్మిస్తున్న 'చాప్టర్ 6' చిత్రం నిర్మిచటానికి ఇప్పటికే చాలా అప్పులు చేసిందని చెప్తున్నారు. అందులోనూ మరో ప్రక్క ఈ ఆర్ధిక కలతలు ఆమె కుటుంబంలోనూ గొడవలు సృష్టిస్తూ విడాకులకు దారి తీసేలా చేస్తోందని చెప్తున్నారు. ఇక ఈ 'చాప్టర్ 6' చిత్రంలో కళ్యాణి ప్రధాన పాత్రలో కనిపిస్తోంది. బాల, సోనియా సూరి హీరో హీరోయిన్లుగా రూపొందుతోంది. మిడాస్ టచ్ పతాకంపై సూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి ఈ సినిమా నిర్మించారు. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమలోని ఆరు విభిన్న కోణాల్ని తెలిపే చిత్రమిదని చెప్తూ ప్రమోట్ చేస్తున్నారు. చిత్రం ఎలాగున్నా అమ్ముడయి కళ్యాణిని అప్పులు నుంచి బయిటపడేస్తే మేలని ఆమె అభిమానించేవారు కోరుకుంటున్నారు. అలాగే ఈ అప్పులు తీర్చడం కోసం కళ్యాణి ప్రాధాన్యత లేని పాత్ర ఆఫర్ వచ్చినా ఆలోచించకుండా ఒప్పుకుంటోందని, టీవీ షోలకు గెస్ట్ గా వెళ్ళటం, టీవీ సీరియల్ అయినా కమిట్ అవ్వాలని నిర్ణయించుకుందిని అంటున్నారు.