Keerthy Suresh నిజమైన బాయ్‌ఫ్రెండ్ వివరాలు లీక్.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే.. రిసార్టులో దొరకడంతోనే!

చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మైమరపించే నటన, అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది క్యూట్ హీరోయిన్ కీర్తి సురేష్. సాదాసీదాగానే కెరీర్‌ను మొదలెట్టిన ఈ అమ్మడు.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇలా సౌత్ ఇండియా మొత్తం హవాను చూపిస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ పెళ్లి వార్త బాగా హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్టార్ హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ వివరాలు బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మొత్తం చూసేయండి మరి!

అలా ఎంట్రీ.. తెలుగులోకి ఇలా

అలా ఎంట్రీ.. తెలుగులోకి ఇలా

చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన కీర్తి సురేష్.. అదే భాషలో 'గీతాంజలి' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలోనూ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కింది.

జాతీయ అవార్డుతో మరింతగా

జాతీయ అవార్డుతో మరింతగా

'నేను శైలజ' తర్వాత తెలుగులో కీర్తి సురేష్ వరుస సినిమాలతో సందడి చేసింది. అలాగే, బడా స్టార్లతో భారీ చిత్రాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో కీర్తి టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా సొంతమైంది.

క్రేజీ మూవీలు.. ఫుల్ బిజీగానే

క్రేజీ మూవీలు.. ఫుల్ బిజీగానే


కీర్తి సురేష్ కెరీర్ తొలినాళ్లలోనే మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా గత ఏడాది వరుసగా 'గుడ్ లక్ సఖి', 'సర్కారు వారి పాట', 'వాషీ', 'సానీ కాయిదామ్' అనే సినిమాలు చేసి తన రేంజ్‌ను పెంచుకుంది.

చిరంజీవి చెల్లి... నాని లవర్

చిరంజీవి చెల్లి... నాని లవర్

దక్షిణాది మొత్తంలో హవాను చూపిస్తూ వరుసగా సినిమాలు చేస్తోన్న మహానటి కీర్తి సురేష్.. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో 'దసరా' మూవీ చేస్తోంది. అలాగే, 'భోళా శంకర్' మూవీలో చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. వీటితో పాటు 'మామన్నన్', 'సిరేన్', 'రఘు తాతా', 'రివాల్వర్ రీటా' అనే తమిళ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని క్రేజ్ ప్రాజెక్టుకుల సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కీర్తి సురేష్ పెళ్లి.. హాట్ టాపిక్

కీర్తి సురేష్ పెళ్లి.. హాట్ టాపిక్

వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపించడంతో పాటు కీర్తి సురేష్ మరిన్ని అవకాశాలను దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి గురించి తరచూ ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో ఆమె ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయిందని ఓ న్యూస్.. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడిని వివాహం చేసుకోబోతుందని ఇంకో వార్తతో తరచూ హైలైట్ అవుతోంది.

కీర్తి బాయ్‌ఫ్రెండ్ డీటేల్స్ లీక్

కీర్తి బాయ్‌ఫ్రెండ్ డీటేల్స్ లీక్


కీర్తి సురేష్ సినిమా రంగానికి చెందిన ప్రముఖుడినే పెళ్లాడబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె బాయ్‌ఫ్రెండ్ వివరాలు లీక్ అయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కీర్తి సురేష్ 13 ఏళ్లుగా తన స్కూల్‌మేట్ (చిన్ననాటి స్నేహితుడు)ను ప్రేమిస్తుందట. ఈ విషయం వీళ్లిద్దరి కుటుంబాలకు కూడా తెలుసు అని టాక్ వినిపిస్తోంది.

అతడి బ్యాగ్రౌండ్.. అక్కడే

అతడి బ్యాగ్రౌండ్.. అక్కడే


స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ ప్రేమిస్తున్న వ్యక్తి కేరళలో ఓ ఫేమస్ రిసార్టుకు ఓనర్ అని తెలిసింది. అతడి పేరిట కొన్ని కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయట. తరచూ అతడిని కలవడం కోసం కీర్తి సురేష్ ఆ రిసార్టుకే వెళ్తుందని ఓ న్యూస్ లీకైంది. ఇటీవలే అక్కడ మీట్ అయినప్పుడు వీళ్లు కెమెరాల కంటికి చిక్కారని.. దీంతో వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X