Keerthy Suresh: మహానటి కీర్తి సురేశ్ మ్యారేజ్ ఫిక్స్.. వరుడు ఎవరంటే

Keerthi Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళ అమ్మాయి అయిన ఈ అమ్మడు తెలుగులో వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది. తన అందం, అభినయంతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్టార్ నిలిచింది. ఇక మహానటి సినిమా నటించి ఈ ముద్దుగుమ్మ తన అభినయంతో మెప్పించింది. మహానటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఆ సినిమా తరువాత ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు దూరమై.. బాలీవుడ్ , కోలీవుడ్ కు దగ్గర అయింది. అయితే.. గత కొంత కాలంగా కీర్తి సురేష్ పెళ్లి గురించి సంబంధించిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఇంతకీ విషయమేమిటంటే?

కీర్తి సురేష్.. బాలనటిగానే కెరీర్‌ను ఆరంభించింది. 2000లో మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ. 'గీతాంజలి' అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అప్పటి నుంచి ఆ భాషతో పాటు తెలుగు, తమిళంలోనూ చిత్రాలు చేస్తోంది. అన్ని చోట్లా ఆదరణ లభించడంతో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలోనే రామ్ పోతినేని - కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆ తరువాత నాని, పవన్ కల్యాణ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Actress Keerthy Suresh likely to get married in December full details here

కీర్తి సురేష్ కెరీర్‌లో 'మహానటి' చిత్రం ఎంత ప్రత్యేకమైనదో చెప్పనక్కర్లేదు. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఈ సినిమాతో కీర్తికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. జాతీయ అవార్డు అందుకుంది. ఈ మూవీ ఆమె కెరీర్‌ తో మైల్ స్టోన్ గా నిలిచింది. అయితే.. ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మరోసారి వార్తల్లో నిలిచింది.

వాస్తవానికి కీర్తి సురేష్ పెళ్లి పుకార్లతో వార్తల్లో నిలవడం కొత్తవి కాదు. గతంలో ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో అనిరుద్ రవిచంద్ర తో దిగిన ఫోటో వైరల్ కావడంతో వీరిద్దరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, కథ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారనీ ప్రచారం జరిగింది. ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ కీర్తి సురేష్ కామెంట్ చేసింది.

Actress Keerthy Suresh likely to get married in December full details here

హీరోయిన్ కీర్తి సురేష్ మరోసారి పెళ్లి పుకార్లతో వార్తల్లో నిలిచింది. ఈ నటి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం..ఈ అమ్మడు పెళ్లి ఫిక్స్ అయిందని, తన తల్లిదండ్రుల నిర్ణయం మేరకు పెళ్లికి ఓకే చెప్పినట్టు సమాచారం. కీర్తి సురేష్ ను పెళ్లి చేసుకోబోయే వరుడు కూడా వారికి దగ్గరి బంధువు అని, పైగా వీరి పెళ్లి డిసెంబర్ లో జరగబోతుందని, గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఇంతవరకు నిజముందో తెలియాలంటే కీర్తి సురేష్ కుటుంబం అధికారికంగా ప్రకటన విడుదల చేసేంతవరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X