ఇక్కడ ఎంతో పద్దతిగా.. అక్కడ మాత్రం హీరోతో మితిమీరిన రొమాన్స్, లిప్ లాక్స్.. ఆ హీరోయిన్ ఎవరంటే!

సినీ రంగంలోకి సాధారణంగానే ఎంతో మంది భామలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతుంటారు. అలాంటి వారిలో మహానటి కీర్తి సురేష్ ఒకరు. చాలా కాలంగా దక్షిణాదిలో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న ఈ చిన్నది.. ఇప్పుడు బాలీవుడ్‌లో సైతం అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడామె సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ కీర్తి సురేష్ ఏం చేయబోతుంది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

చిన్నప్పుడే.. హీరోయిన్‌గా:కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'గీతాంజలి' అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాల్లో ఫీమేల్ లీడ్‌గా చేసింది. ఈ క్రమంలోనే రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి పరిచయం అయింది. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు గుర్తింపుతో పాటు ఆఫర్లు లభించాయి.

Actress Keerthy Suresh Ready For Romance and Liplock With Varun Dhawan

నేషనల్ అవార్డు పొంది:కీర్తి సురేష్ 'నేను శైలజ' తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ హవా చూపించింది. అలాగే, బడా స్టార్లతో భారీ చిత్రాల్లోనూ భాగం అయింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు దక్కింది.

తెలుగులో కెరీర్ ఇలాగ:కెరీర్ ఆరంభంలో స్లోగానే సినిమాలు చేసిన కీర్తి సురేష్.. స్టార్‌గా మారిన తర్వాత మాత్రం జెట్ స్పీడుతో మూవీలు చేసింది. ఇలా 2022లో వరుసగా 'గుడ్ లక్ సఖి', 'సర్కారు వారి పాట', 'వాషీ', 'సానీ కాయిదామ్' అనే సినిమాలు చేసింది. ఇక, 2023లో 'దసరా', 'నాయకుడు', 'భోళా శంకర్' వంటి చిత్రాలతో వచ్చింది. ఇలా తెలుగులో కెరీర్‌ను సాగిస్తోంది.

Actress Keerthy Suresh Ready For Romance and Liplock With Varun Dhawan

ఇప్పుడివే.. బాలీవుడ్‌లో:సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ హవాను చూపిస్తోన్న కీర్తి సురేష్.. ఇప్పుడు ఈ బ్యూటీ 'సైరన్', 'రఘు తాతా', 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి' అనే తమిళ సినిమాల్లోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సైతం కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ముఖ్యంగా ఇప్పుడు కీర్తి 'బేబీ జాన్' అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తూ ముందుకు సాగుతోంది.

బేబీ జాన్‌లో రొమాన్స్:కీర్తి సురేష్ హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత గ్లామర్ షోకు, రొమాన్స్‌కు పచ్చజెండా ఊపలేదు. కానీ, ఇప్పుడు బాలీవుడ్‌లో చేస్తున్న 'బేబీ జాన్' మూవీ కోసం మాత్రం ఆమె గేట్లు ఎత్తేసినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో కీర్తి సురేష్.. హీరో వరుణ్ ధావన్‌తో మితిమీరిన రొమాన్స్ చేయడంతో పాటు లిప్‌లాక్‌లతో రెచ్చిపోబోతుందని తెలుస్తోంది.

Actress Keerthy Suresh Ready For Romance and Liplock With Varun Dhawan

ఆ సినిమాకు రీమేక్‌గా:'బేబీ జాన్' సినిమా తమిళ చిత్రం 'తేరీ'కి రీమేక్‌గా రాబోతుంది. ఈ చిత్రాన్ని కాలీస్ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ పాత్రను మరింత ఎలివేట్ చేయడంతో పాటు రొమాన్స్ డోస్‌ను పెంచి మరీ చూపించబోతున్నారని తెలుస్తోంది. పాత్ర డిమాండ్ చేయడంతో పాటు బాలీవుడ్‌లో పాగా వేసేందుకే కీర్తి సురేష్ ఈ సాహసానికి రెడీ అయిందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X