ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి వరుస ఫ్లాప్స్ కు కారణం ఆమె.. అత్యాశకు పోయి.. అసలు ఏం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ వచ్చిన కొత్తలో వరుస విజయాలను అందుకోవడంతో వారి రేంజ్ ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. అయితే ఆ సమయంలో కరెక్ట్ పర్సన్ వారి వెంట ఉంటే మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి మిస్టేక్స్ వేసినా కూడా ఊహించిన విధంగా మళ్లీ డౌన్ ఫాల్ కావాల్సి వస్తుంది. ఇక మొదట్లో వరుస విజయాలు అందుకున్న హీరోయిన్ కృతి శెట్టి ఆ తర్వాత ఒకరి కారణంగా డిజాస్టర్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఆ వివరాలలోకి వెళితే..

మొదట్లోనే..

కృతి శెట్టి మొదట కమర్షియల్ యాడ్స్ లో కనిపించి నటిగా మంచి గుర్తింపును అందుకుంది. చిన్నతనం నుంచి ఆమె కెమెరా ముందు బాగా అలవాటు పడింది. దీంతో హీరోయిన్ గా అడుగులు వేయాలి అని నిర్ణయం తీసుకుంది. ఇక ఆమెకు తల్లిదండ్రులు కూడా బాగా సపోర్ట్ చేశారు. అమ్మడు మొదట ఉప్పెన సినిమా కోసం సెలెక్ట్ కాగానే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

krithishetty

కమర్షియల్ గా విజయం

ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ బ్యూటీకి తిరుగులేదు అని అందరూ అనుకున్నారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో కృతి శెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది. ఇక అనుకున్నట్టే ఆమెకు మంచి ఆఫర్స్ వచ్చాయి. సెకండ్ మూవీ శ్యామ్ సింగరాయ్ అలాగే మూడవ సినిమా బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి విజయాలను అందుకున్నాయి.

వరుసగా అపజయాలు

ఇక అలా ఆ సినిమాలో సక్సెస్ కావడంతో అమ్మడు ఒకేసారి కోటికి పైగా పారితోషికం కూడా పెంచింది. అయితే అప్పుడే ఆమె దారుణమైన కొన్ని రెగ్యులర్ కమర్షియల్ కథలను సెలెక్ట్ చేసుకుని తొందరపడింది. ది వారియర్ సినిమాతో పాటు నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా పూర్తిగా కమర్షియల్ ఫార్మట్ లో రావడంతో ప్రేక్షకులు పెద్దగా ఆ సినిమాల వైపు చూడలేదు. దీంతో ఆ రెండు సినిమాలు కూడా అమ్మడే రేంజ్ ను ఒక్కసారిగా తగ్గించాయి.

krithishetty

సగానికి పైగా తగ్గించేసే..

ఇక తర్వాత సుధీర్ బాబు మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అనుకున్నప్పటికీ కూడా కృతి శెట్టికి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో ఆ సినిమా తర్వాత అమ్మడు తన పారితోషికాన్ని ఒక్కసారిగా సగానికి పైగా తగ్గించేసే ఇప్పుడు కేవలం 50 లక్షలు మాత్రమే తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఫ్లాప్స్ కు ఆమె కారణం?

20 ఏళ్ళ వయసులోకి రాకముందే కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న ఈ బ్యూటీ హఠాత్తుగా ఒకేసారి సగానికి పైగా రెమ్యూనరేషన్ ఎందుకు తగ్గించింది అనే విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఆమె తల్లిని నీతి శెట్టి అనవసరంగా ఆశపడి రొటీన్ కమర్షియల్ కథలను సెలెక్ట్ చేయించడం వలన కృతి శెట్టి కెరీర్ పై భారం పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కృతి శెట్టి ప్రతి పాత్ర పై కూడా దర్శకులతో మాట్లాడడం చేంజ్ చేయాలి అని అడగడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యేట. ఆ విధంగా చేయడం వలన కృతి శెట్టి క్రేజ్ మెల్లమెల్లగా తగ్గిపోతుందనే టాక్ వస్తోంది. మరి ఎంతవరకు నిజమో తెలియాలి అంటే వారే క్లారిటీ ఇవ్వాలి.

krithishetty

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X