Meena: నటి మీనా షాకింగ్ నిర్ణయం, రెండో పెళ్లికి సిద్ధం?.. వరుడెవరో తెలుసా?

సీనియర్ నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవరసరం లేదు. ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. తెలుగు, తమిళం తదితర భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి అమితమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అగ్ర కథనాయికగా వెలుగొందిన మీనా ప్రస్తుతం మంచి పాత్రలు చేస్తూ నటిగా పాపులర్ అవుతోంది. అయితే ఇటీవల ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాళ్లోకి వెళితే..

అనారోగ్య కారణాలతో..

అనారోగ్య కారణాలతో..

దక్షిణాది భాషల్లో అగ్ర కథానాయకులుతో జోడి కట్టి స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు మీనా. ఇటీవల కాలంలో ఆమె పలు ప్రాధాన్యత గల పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. మీనా, వెంకటేష్ కలిసి నటించిన దృశ్యం సినిమా సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె భర్త విద్యాసాగర్ పలు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే.

 రెండో పెళ్లికి రెడీ..

రెండో పెళ్లికి రెడీ..

కరోనా మహమ్మారి కారణంగా ఆయన ఆరోగ్యం చెడిపోయినట్లు అప్పట్లో వైద్యులు పేర్కొన్నారు. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్ తోనే విద్యాసాగర్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయారు నటి మీనా. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. బాధను పొగోట్టుకునేందుకు షూటింగ్స్ కు సైతం అటెండ్ అవుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులో ఆమె రెండో వివాహానికి రెడీ అయ్యారని టాలీవుడ్ లో తెగ ప్రచారం జరుగుతోంది.

 బలవంతం చేస్తున్నారని..

బలవంతం చేస్తున్నారని..

అయితే మీనాకు ఈ రెండో పెళ్లి అంటే ఏమాత్రం ఇష్టం లేదట. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. 46 ఏళ్లు ఉన్న సీనియర్ నటి మీనాకు ఒక కుమార్తె కూడా ఉంది. కూతురు కోసమైనా రెండో పెళ్లి చేసుకోమ్మని తల్లిదండ్రులు బలవంతం పెడుతున్నారని సమాచారం. మీనా కుమార్తె భవిష్యత్తు బాగుండాలన్నా, ఆమె ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలన్నా మరొకరి తోడు ఉంటే బాగుంటుందని మీనా తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారట.

అతి సన్నిహితుడితో..

అతి సన్నిహితుడితో..

తల్లిదండ్రులు బలవంతం మీద, ఆమె కుమార్తె కోసం మీనా రెండో వివాహానికి ఒప్పుకున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. మీనా కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తినే ఆమె వివాహం చేసుకునేందుకు అంగీకరించిందని సమాచారం. ఆ వ్యక్తి విద్యాసాగర్ కు కూడా బాగా తెలుసని, వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పెళ్లి వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సినిమాల్లో నటించిన నైనికా..

సినిమాల్లో నటించిన నైనికా..

మీనా కుమార్తె నైనికా విద్యాసాగర్ కి ప్రస్తుతం 11 ఏళ్లు. ఆమె 2011లో జన్మించింది. అంతేకాకుండా నటి మీనా కూతురు నైనికా పలు సినిమాల్లో కూడా నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన థేరి సినిమాలో అతని కూతురిగా ఆకట్టుకుంది నైనికా. ఈ సినిమాను తెలుగులో పోలీసోడుగా విడుదల చేశారు. ఈ సినిమా తర్వాత భాస్కర్ ఒరు రాస్కల్ అనే సినిమాలో కూడా నటించింది. ఇందులో ప్రధాన పాత్రలో అరవింద్ స్వామి యాక్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X