»   »  రాసలీలల కేసు: నటి నయనా కృష్ణ బెయిల్ రద్దుకు పిటిషన్ యోచన

రాసలీలల కేసు: నటి నయనా కృష్ణ బెయిల్ రద్దుకు పిటిషన్ యోచన

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: విచారణకు సహకరించకుండ తప్పించుకు తిరుగుతున్న కన్నడ నటి నయనా కృష్ణ బెయిల్ రద్దు చెయ్యాలని కోర్టు లో మనవి చెయ్యాలని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు నిర్ణయించారు. గత 8 నెలల నుండి నయనా కృష్ణ ఆచూకి లభించడం లేదని అధికారులు చెప్పారు.

గత సంవత్సరం జూన్ నెలలో బసవేశ్వర నగర సర్కిల్ లోని ప్రముఖ వైద్యుడు రాసలీలలు సాగిస్తున్న సమయంలో నయనా కృష్ణ తన గ్యాంగ్ తో కలిసి రహస్యంగా వీడియో చిత్రీకరించారు. తరువాత వైద్యుడికి క్లిప్పింగ్ లు చూపించి బ్లాక్ మెయిల్ చేసి రూ. లక్షలు వసూలు చేశారు.

Actress Nayana Krishna, who is accused in the honeytrap blackmail case

ఇదే కేసులో నయనా కృష్ణ, బెంగళూరులోని కెంపేగౌడ నగర పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మల్లేష్ తో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఇదే కేసులో నయనా కృష్ణ కోర్టులో షరతులతో కూడిన బెయిల్ తీసుకుంది. విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి అదేశాలు జారీ చేశారు.

అయితే ఆమె 8 నెలల నుండి కనపడటం లేదని, సంజయ్ నగరలోని ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోయిందని పోలీసు అధికారులు అంటున్నారు. నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకొలేదని, మొబైల్ లో చిక్కడం లేదని, అందు వలన ఆమె జామీను రద్దు చెయ్యాలని కోర్టులో అర్జీ సమర్పించాలని సీసీబీ అధికారులు నిర్ణయించారు.

అదే విదంగా ఐటి కంపెనీకి చెందిన నారాయణ అనే వ్యక్తిని నయనా బ్లాక్ మెయిల్ చేసిందని కేసు నమోదు అయ్యింది.

English summary
Nayana's friend Sanjana met the doctor at his residence in June and engaged in sexual activities with him, secretly recording a sex tape of the same. The gang later blackmailed him of taking the video to the media if he doesn't pay them Rs ₹1 crore.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu