Nayanathara పెళ్లికి రాబోతున్న అగ్ర హీరోలు.. మాజీ ప్రియులు కూడా?

మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ నయనతార పెళ్లి పై గత కొన్నేళ్లుగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక నయన్ యువ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లి త్వరలోనే జరగబోతుంది అని అనేక సార్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంపై ఈ జోడి నిత్యం సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వారి లవ్ ట్రాక్ ను కొనసాగించింది. ఇక మొత్తానికి సాంప్రదాయాల ప్రకారం వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈ వేడుకకు ఎవరు రాబోతున్నారు అనే విషయంలో కూడా తమిళ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా నయనతార మాజీ ప్రియులు కూడా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది ఎంతవరకు నిజం అనే వివరాల్లోకి వెళితే..

18 ఏళ్ళ స్టార్ కెరీర్

18 ఏళ్ళ స్టార్ కెరీర్

తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నయనతార సక్సెస్ తో సంబంధం లేకుండా గత 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమెకు పోటీగా ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వచ్చినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఏ ఫ్లాప్ సినిమా కూడా నయనతార స్పీడ్ కు బ్రేక్ వేయలేదు అనే చెప్పాలి

ఫస్ట్ లవ్

ఫస్ట్ లవ్

అయితే కెరీర్ విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉన్న నయనతార పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం కొన్ని పొరపాట్ల కారణంగా చాలా సార్లు మనోవేదనకు గురి కావాల్సి వచ్చింది. మొదట ఆమె తమిళ హీరో శింబుతో ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే. ఇక కొన్నాళ్ళకే వారి ప్రేమకు ముగింపు కార్డు పడింది. చాలా గొడవలతో ఇద్దరు విడిపోయినట్లు కూడా అప్పట్లో వార్తలు చాలానే వచ్చాయి.

 అలా ప్రభుదేవాతో..

అలా ప్రభుదేవాతో..


ఇక శింబుతో విడిపోయిన తర్వాత మీడియా ముందుకు రాని నయనతార సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా తో ప్రేమలో పడింది. వారి ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్ళింది. కానీ ప్రభుదేవా ఫస్ట్ మ్యారేజ్ గొడవల కారణంతో ఆ పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది. అనంతరం ప్రభుదేవా నయనతార కూడా విడిపోవాల్సి వచ్చింది.

 విగ్నేష్ తో ప్రేమ యాత్రలు

విగ్నేష్ తో ప్రేమ యాత్రలు


ఇక గత కొన్నేళ్లుగా నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. విగ్నేష్ ఇంకా అగ్ర దర్శకుడి గా మారక ముందు నుంచే నయనతార అతన్ని ఇష్టపడింది. వారి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా కాలంగా వారికి సంబంధించిన ఎన్నో ప్రత్యేకమైన ఫోటోలను కూడా షేర్ చేసుకుంటున్నారు. పెళ్లికి ముందే ఇప్పటికే ఎన్నోసార్లు హాలిడే వెకేషన్స్ కు కూడా విదేశాలకు వెళ్లారు.

పెళ్లి ప్లాన్ రెడీ

పెళ్లి ప్లాన్ రెడీ

ఇక మొత్తానికి విగ్నేష్ తో మూడు ముళ్ళు వేయించుకోవడానికి నయనతార సిద్ధమైంది. అసలైతే వీరి పెళ్లి తిరుపతిలోనే జరుగుతుంది అని అప్పట్లో అయితే టాక్ గట్టిగానే వచ్చింది. కానీ ఇప్పుడు నయనతార కేవలం తన కుటుంబ సభ్యుల సమక్షంలో తమిళనాడు లోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. జూన్ 9వ తేదీన మహాబలిపురంలో మహాబ్ హోటల్లో వీరి వివాహం జరగనుంది.. అలాగే కొంతమంది సినీ ప్రముఖులకు కూడా ఆమె ప్రత్యేకంగా ఇన్విటేషన్ కూడా పంపారు. రీసెంట్గా తమిళనాడు ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు కూడా ప్రియుడితో కలిసి నయన్ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను ఇచ్చింది.

 పెళ్లికి మాజీ ప్రియులు?

పెళ్లికి మాజీ ప్రియులు?


అయితే ఈ పెళ్లి వేడుకకు నయనతార మాజీ ప్రియులు కూడా హాజరు కాబోతున్నారని తమిళ మీడియాలో జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా నిమిషాల్లోనే ఆ టాపిక్ గా వైరల్ గా మారింది. శింబు, ప్రభుదేవా వస్తున్నారు అని విగ్నేష్ సలహాతోనే నయనతార వారికి కూడా ఇన్విటేషన్ పంపినట్లు సోషల్ మీడియాలో టాక్ వైరల్ అయింది. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం అయితే అందులో ఎలాంటి నిజం లేదని సమాచారం. ఇక పెళ్లి తర్వాత జరగబోయే వివాహ వేడుకకు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ ఇలా నయనతారతో వర్క్ చేసిన అగ్ర హీరోలందరి కూడా ఆ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X