వరుసగా మూడు డిజాస్టర్లు.. అయినా తగ్గని బుట్టబొమ్మ.. మరో స్టార్ హీరోతో లక్కీ ఛాన్స్?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో అగ్రహీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకున్న వారిలో పూజ హెగ్డే టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఆమెకు పోటీగా రష్మిక మందన ఉన్నప్పటికీ కూడా పూజ లిస్టు లోనే అత్యధిక బడ్జెట్ సినిమాలు ఉండడం విశేషం. అల.. వైకుంఠపురములో సినిమా నుంచి ఆమె స్పీడ్ పెరిగింది. రెమ్యునరేషన్ విషయంలో కూడా పాత రికార్డులను బ్రేక్ చేస్తూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా కూడా క్రేజ్ అందుకుంటోంది.

అంతే కాకుండా వరుసగా పాన్ ఇండియా సినిమాలు కూడా ఆమె చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే రీసెంట్ గా పూజ హెగ్డే వరుసగా మూడు పెద్ద సినిమాలు చేయగా అవి డిజాస్టర్ అయ్యాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు వంద కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన బీస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశపడింది. మొదటిసారి విజయ్ తో కలిసి నటించిన సినిమా కాబట్టి భారీ స్థాయిలో సక్సెస్ అవుతుందని అనుకుంది. కానీ బీస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

Actress Pooja hegde another lucky chance with tollywood star hero

ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ మెగా పవర్ స్టార్ నటించిన ఆచార్య సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. పూజ హెగ్డే సినిమాలో రామ్ చరణ్ జోడీగా నీలాంబరి అనే పాత్రలో నటించింది. అయితే ఆ సినిమా కూడా తేడా కొట్టేయడంతో మరోసారి పూజ హెగ్డే ఐరన్ లెగ్ అని సోషల్ మీడియాలో ట్రోల్ మొదలు పెట్టేశారు. అయినప్పటికీ కూడా పూజ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన భవిష్యత్తు ప్రాజెక్టులపై మరింత ఫోకస్ పెడుతోంది.

ప్రస్తుతం ఆమె చేతిలో అయితే చాలా మంచి సినిమాలే ఉన్నాయి ముఖ్యంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే విజయ్ దేవరకొండ తో కూడా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మరొక కొత్త ప్రాజెక్టుపై ఒక యువ దర్శకుడి తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రాజెక్టు కోసమే పూజను సంప్రదించినట్లు గా టాక్ వస్తుంది. అది కాకపోతే పూరి జగన్నాథ్ జనగణమన ప్రాజెక్టు కోసం సంప్రదించి జనడవచ్చని కూడా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ రెండిటిలో పూజ హెగ్డే ఏ ప్రాజెక్టులో నటిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X