పూజా హెగ్దేకు తెలుగులో నో ఆఫర్స్.. అందుకు కారణం మహేశ్ బాబు సినిమానా?

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. తన చిత్రాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తెలుగు, తమిళం చిత్రాల్లో స్టార్ హీరోల సరసన ధీటైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే అన్ని భాషల్లో కంటే టాలీవుడ్ లో పూజా హెగ్దే మంచి సక్సెస్ ను అందుకుంది. అలాంటిది ఆమెకు ఇప్పుడు తెలుగులోనే ఆఫర్స్ రాకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. అందుకు కారణం ఏంటనేదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

పూజా హెగ్దే సక్సెస్ ఫుల్ ఫిల్మ్స్..
ముంబైకి చెందిన పూజా హెగ్దే 2012 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోంది. తొలుత తమిళ చిత్ర పరిశ్రమలో 2012లో వచ్చిన ముగమ్ముడి అనే సూపర్ హీరో ఫిల్మ్ లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. జీవా సరసన నటించింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక లైలా కోసం, ముకుంద వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వెంటనే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ సరసన మొహెంజో దారో చిత్రంలో నటించి మెప్పింది.

Pooja Hegde do not have any movie offer from Tollywood

ఇక తెలుగులో పూజా హెగ్దే అరవింద సమేత వీర రాఘవ, సూపర్ స్టార్ మహేశ్ బాబు మహర్షి, గద్దలకొండ గణేశ్, అలా వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలతో మంచి సక్సెస్ అందుకుంది. స్టార్ హీరోలతో కలిసి పనిచేయడం మూలంగా తనకంటూ టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. అయితే 2022 తర్వాత నుంచి పూజా హెగ్దేకు తెలుగు ప్రాజక్ట్స్ లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బుట్టబొమ్మ బిజీగా ఉంటోంది.

పూజా హెగ్దేకు సరైన అవకాశాలు రాకపోవడానికి కారణం సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరుకారం చిత్రమని కొందరి అభిప్రాయం. ఆ సినిమాలో శ్రీలీలా కంటే ముందు పూజా హెగ్దేను తీసుకున్నారు. కానీ తర్వాత మహేశ్ బాబు సినిమా నుంచి తప్పించారు. మహేశ్ బాబు చిత్రం నుంచి పూజా హెగ్దేను రిజెక్ట్ చేయడంతో అప్పటి నుంచి తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయనేది చర్చ. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, అగ్ర నిర్మాణ సంస్థ నుంచి రిజెక్షన్ వచ్చినందు వల్లే పూజా హెగ్దేకు ఆఫర్స్ అందడం లేదని వాదన.

అయితే దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. అసలు పూజా హెగ్దేను ఎవరూ రిజెక్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆమె సక్సెస్, ఫెయిల్యూర్ కారణాలతో ఎప్పుడూ కాస్టింగ్ చేయలేదని చెప్పారు. అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోనూ ఆమెను కావాలనే తీసుకున్నాం. కానీ గుంటూరుకారం విషయంలో ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లనే శ్రీలీలాను తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇక పూజా హెగ్దే మళ్లీ ఎప్పుడూ తెలుగు సినిమా ఆఫర్ అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 14న మాత్రం రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లోని కూలి చిత్రంతో అలరించనుంది. మరోవైపు తమిళంలోనే జననాయగన్, కాంచన 4 వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Read more about: pooja hegde mahesh babu coolie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X