అలా.. రెమ్యునరేషన్ పెంచిన పూజా హెగ్డే.. ఇప్పుడు రేటు ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్స్ ఎక్కువగా బిజీగా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు ఒక సినిమా చేస్తుంటే వీళ్ళు మాత్రం ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులను లైన్ లో పెట్టి చాలా స్పీడ్ గా బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటారు. ఇక స్టార్ డమ్ అనేది ఎక్కువ కాలం ఉండదు కాబట్టి.. ఉన్న రోజుల్లోనే గట్టిగా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటారు. ప్రస్తుతం పూజా హెగ్డే కూడా అదే ఫార్ములాలో వెళుతున్నట్లు టాక్ వస్తోంది.

కెరీర్ మొదట్లో వరుస డిజాస్టర్స్

కెరీర్ మొదట్లో వరుస డిజాస్టర్స్

కెరీర్ మొదట్లో అమ్మడు ఏ స్థాయిలో డిజాస్టర్స్ ఎదుర్కొందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా ఈ బ్యూటి ఎంచుకున్న కథలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. మొదట్లో కొలుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. ఇక ఎప్పుడైతే బికినీలో దర్శనమిచ్చిందో అప్పటి నుంచి వరుస అవకాశాలతో పాటు బాక్సాఫీస్ హిట్స్ కూడా దక్కాయి.

రెమ్యునరేషన్ కి రెక్కలు వచ్చినట్లు..

రెమ్యునరేషన్ కి రెక్కలు వచ్చినట్లు..

దువ్వాడ జగన్నాథమ్, అల.. వైకుంఠపురములో సినిమాల ఎఫెక్ట్ తో అమ్మడు స్టార్ హీరోలకు రెగ్యులర్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకేసారి కోటికి పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాకు 1.40కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మెల్లగా ఆ రెమ్యునరేషన్ కి రెక్కలు వచ్చినట్లు తెలుస్తోంది.

అలా..వైకుంఠపురములో తరువాత

అలా..వైకుంఠపురములో తరువాత

అల..వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద 150కోట్లకు పైగా షేర్స్ ని అందించడంతో అమ్మడి లెవెల్ మారిపోయింది. అందుకే రెమ్యునరేషన్ లెవెల్ ని కూడా పెంచేసినట్లు తెలుస్తోంది. అలా.. సినిమా అనంతరం పూజా హెగ్డే 2కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

Recommended Video

#Prabhas20Firstlook : Prabhas 20 Title Might Be Annouce This June!
రాధే శ్యామ్ కోసం ఎంతంటే..

రాధే శ్యామ్ కోసం ఎంతంటే..

ఇక రాధే శ్యామ్ సినిమాకు మాత్రం పూజా కేవలం కోటి రూపాయాలే తీసుకుంటోంది. ఎందుకంటే ఆ సినిమాకు అల..వైకుంఠపురములో కంటే ముందే సైన్ చేసింది. ఇక నుంచి వచ్చే ప్రాజెక్టులకు మాత్రం అమ్మడు 2కోట్లకు తగ్గనని క్లారిటీగా చేబుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఆ బ్యూటీనే క్లారిటీ ఇవ్వాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X