»   » మహేష్ బాబు మరో మూవీ ఖరారు, హీరోయిన్ ఆవిడేనా?

మహేష్ బాబు మరో మూవీ ఖరారు, హీరోయిన్ ఆవిడేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. అందులో ఒకటి 'మురుగదాస్' దర్శకత్వంలో వస్తున్న 'స్పైడర్' చిత్రం కాగా మరొకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భరత్ అను నేను'. ఈ రెండు చిత్రాల షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

ఈ రెండు చిత్రాల తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల షూటింగ్ ముగిసిన తర్వాత అంటే... 2018లో ఈ సినిమా ప్రారంభం కాబోతోంది.

 Actress Pooja Hegde to the share screen with Mahesh Babu

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వంశీ పైడిల్లి ఈ చిత్రానికి హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిజె మూవీ రషెస్ చూసి వంశీ బాగా ఇంప్రెస్ అయ్యాడని, మహేష్ బాబు పర్సనాలిటీకి ఆమె బాగా సూటవుతుందనే నిర్ణయానికి వచ్చాడట.

మాజీ మిస్ ఇండియా అయిన పూజా హెగ్డే బాలీవుడ్లో మొహంజోదారో లాంటి భారీ బడ్జెట్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. కోటి వరకు డిమాండ్ చేస్తోందట. అందగత్తెతో పాటు, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి కావడంతో అంత మొత్తం ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనకాడటం లేదు.

English summary
Actress Pooja Hegde to share the screen with Mahesh Babu in his next film which is directed by Vamsi Paidipally.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu